Share News

భారత్‌ జోలికొస్తే బుద్ధి చెప్పక తప్పదు

ABN , Publish Date - May 19 , 2025 | 10:52 PM

భారతదేశం జోలికిస్తే ఎవరికైనా బుద్ధి చెప్పక తప్పదని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైన నేపథ్యంలో సోమవారం ఉదయం పట్టణంలో టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ, రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగులు, మెప్మా, మున్సిపల్‌ సిబ్బంది, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీని నిర్వహించారు.

భారత్‌ జోలికొస్తే బుద్ధి చెప్పక తప్పదు
తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి

ఎమ్మెల్యే నారాయణరెడ్డి

పట్టణంలో ఉత్సాహంగా తిరంగా ర్యాలీ

మార్కాపురం, మే 19 (ఆంధ్రజ్యోతి) : భారతదేశం జోలికిస్తే ఎవరికైనా బుద్ధి చెప్పక తప్పదని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైన నేపథ్యంలో సోమవారం ఉదయం పట్టణంలో టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ, రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగులు, మెప్మా, మున్సిపల్‌ సిబ్బంది, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీని నిర్వహించారు. ముందుగా స్థానిక గడియార స్తంభం వద్ద ర్యాలీనీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రదాడులతో పొరుగుదేశం పాకిస్థాన్‌ దుందుడుకు చర్యలకు మన దేశ ఆర్మీ దీటుగా సమాధానం ఇచ్చిందన్నారు. ఒకవైపు ఉగ్రవాదులను దేశంలోనే ఉంచుకుని దేశంపైకి పురిగొల్పిందన్నారు. మన దేశ రక్షణ వ్యవస్థ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేకిన్‌ ఇండియా నినాదంతో స్వదేశీ పరాజ్ఞనాన్ని పెంపొందించుకుంటున్నామన్నారు. రక్షణరంగంలో ఎవరికీ తీసిపోని దుర్భేద్యంగా తయారైందన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో దేశం కోసం కొందరు సైనికులు వీరమరణం పొందారన్నారు. వారి త్యాగాలు వెలకట్టలేనివన్నారు. ర్యాలీ దోర్నాల బస్టాండ్‌ వరకు సాగింది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున్‌, తాళ్లపల్లి సత్యనారాయణ, మాలపాటి వెంకటరెడ్డి గుంటక సుబ్బారెడ్డి, బీజేపీ నాయకులు పీవీ కృష్ణారావు, శాసనాల సరోజిని, శిరసనగండ్ల శ్రీనివాసులు, మద్దెల లక్ష్మి, జనసేన నాయకులు ఎన్‌వీ సురే్‌షబాబు, ఖాశిం, రిటైర్డ్‌ ఆర్టీ ఉద్యోగులు, మెప్మా మహిళలు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2025 | 10:53 PM