ఆదర్శనీయులు ప్రకాశం పంతులు
ABN , Publish Date - May 21 , 2025 | 01:03 AM
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శనీయులని, ఆయన బాటలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఆంధ్రకేసరి 68వ వర్ధంతి సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లోని ఆయన విగ్రహానికి కలెక్టర్ అన్సారియా, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. బీఎన్.విజయకుమార్, మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు కలెక్టరేట్, మే 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శనీయులని, ఆయన బాటలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఆంధ్రకేసరి 68వ వర్ధంతి సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లోని ఆయన విగ్రహానికి కలెక్టర్ అన్సారియా, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. బీఎన్.విజయకుమార్, మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలోనూ, దేశాభివృద్ధిలోనూ ప్రకాశం పంతులు ఎంతో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషిచేద్దామన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ధైర్య సాహసాలకు ప్రతీక ప్రకాశం పంతులు అని అన్నారు. రాజకీయాలలో ఆయన నెలకొల్పిన విలువలు ఆదర్శనీయమని తెలిపారు. ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్.విజయ్‌కుమార్ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నా దానిని త్యాగం చేసి దేశం కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి ప్రకాశం పంతులు అని కీర్తించారు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులు మునిమనుమడు టంగుటూరి సంతోష్‌ను సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్వో చినఓబులేషు, మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.