Share News

నిబద్ధతతో పనిచేస్తా

ABN , Publish Date - Jun 01 , 2025 | 01:36 AM

నిబద్ధత, నిజాయితీతో పనిచేసి రైతుల్లో టీడీపీ ప్రభుత్వ గౌరవం పెరిగే విధంగా ముందుకెళ్తా నని పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్య చెప్పారు. శనివారం ఉదయం ఆయన ఒంగోలులోని బ్యాంకు ప్రధాన కార్యాలయానికి వెళ్లి పర్సన్‌ ఇన్‌చార్జి (చైర్మన్‌)గా బాధ్యతలు స్వీకరించారు.

నిబద్ధతతో పనిచేస్తా
బాధ్యతలు స్వీకరిస్తున్న డాక్టర్‌ సీతారామయ్య

డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్య

పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

నిబద్ధత, నిజాయితీతో పనిచేసి రైతుల్లో టీడీపీ ప్రభుత్వ గౌరవం పెరిగే విధంగా ముందుకెళ్తా నని పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్య చెప్పారు. శనివారం ఉదయం ఆయన ఒంగోలులోని బ్యాంకు ప్రధాన కార్యాలయానికి వెళ్లి పర్సన్‌ ఇన్‌చార్జి (చైర్మన్‌)గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సందర్భంగా తనను కలిసిన ఉద్యోగులు, మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన తండ్రి రమణారావు ద్వారా ప్రజాసేవకు తాను ఆకర్షితుడినయ్యానని తెలిపారు. డాక్టర్‌ వృత్తితోపాటు టీడీపీపై ఉన్న అభిమానంతో పార్టీ పటిష్టతకు తనవంతు పాటుపడ్డానని చెప్పారు. ప్రస్తుతం ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్‌, ఎంపీ మాగుంట, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు స్వామి, రవికుమార్‌, యావత్‌ టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల సిఫార్సుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ తనకు పీడీసీసీబీ పర్సన్‌ఇన్‌చార్జిగా అవకాశం ఇచ్చారన్నారు. వారి నమ్మకం వమ్ము కాకుండా పనిచేస్తానన్నారు. డాక్టర్‌ వృత్తికన్నా బ్యాంకు బాధ్యతలకే సమయాన్ని ఎక్కువ కేటాయించి పనిచేస్తానని చెప్పారు. తెలియని విషయాలను తెలుసుకొను తాను మాటపడకుండా, తనకు అవకాశం ఇచ్చిన వారికి మాట రాకుండా రైతు సేవలో ముందుకెళ్తానని స్పష్టం చేశారు. తనను కలిసిన సెంట్రల్‌ బ్యాంకు అధికారులు, సిబ్బందిని సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీసీవో ఇందిరాదేవి, బ్యాంకు ఇన్‌చార్జి సీఈవో రాఘవయ్య, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2025 | 01:36 AM