Share News

ఆర్యవైశ్యులకు అండగా ఉంటా

ABN , Publish Date - Dec 27 , 2025 | 11:38 PM

ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఎస్‌ఐ వేమన ప్రవర్తనతో గాయపడిన యదాల అవినాష్‌, యాదాల కోటేశ్వరరావును శనివారం ఆయన పరామర్శించారు. పోలీసులు విధి నిర్వహణలో సంయమనంతో వ్యవహరించాలని కోరారు.

ఆర్యవైశ్యులకు అండగా ఉంటా
బాధితులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే కందుల

ఎమ్మెల్యే కందుల

పొదిలి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఎస్‌ఐ వేమన ప్రవర్తనతో గాయపడిన యదాల అవినాష్‌, యాదాల కోటేశ్వరరావును శనివారం ఆయన పరామర్శించారు. పోలీసులు విధి నిర్వహణలో సంయమనంతో వ్యవహరించాలని కోరారు. దుందుడుకు చర్యలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని హితవు పలికారు. బాధితులు తమపట్ల ఎస్‌ఐ అత్యంత దారుణంగా ప్రవర్తించారని ఎమ్మెల్యే ముందు వాపోయారు. మేము రౌడీలము, హంతకులము కామని వ్యాపారులమని ఆర్యవైశ్య సంఘ నాయకులు ఎమ్మెల్యేకు చెప్పారు. దౌర్జన్యంగా వ్యవహరించిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు. చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామన్నారు. ఎమ్మెల్యే కందుల స్పందిస్తూ ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఉగ్ర సైతం బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్‌, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు, సెక్రెటరీ సుబ్బారావు, క్రిష్ణమూర్తి, వాసవి షాపింగ్‌ కాంప్లెక్స్‌ ట్రెజరర్‌ తిరుపాలు, మధు, నరసింహారావు, సామిసూరి పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 11:38 PM