Share News

రూ.2కోట్లు ఇచ్చా.. శిలాఫలకంపై పేరు లేదు

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:23 AM

‘పోలీసు అతిఽథి గృహం నిర్మాణా నికి ఎంపీ లాడ్స్‌ నుంచి రూ.2కోట్లు ఇచ్చా. కనీసం శిలాఫలకంపై పేరు లేదు. ప్రారంభానికి కూడా పిలవలేదు’ అంటూ ఒంగోలు పార్లమెంట్‌ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

రూ.2కోట్లు ఇచ్చా..  శిలాఫలకంపై పేరు లేదు

ఎంపీ మాగుంట ఆవేదన

ఒంగోలు క్రైం, డిసెంబరు 22(ఆంధ్ర జ్యోతి): ‘పోలీసు అతిఽథి గృహం నిర్మాణా నికి ఎంపీ లాడ్స్‌ నుంచి రూ.2కోట్లు ఇచ్చా. కనీసం శిలాఫలకంపై పేరు లేదు. ప్రారంభానికి కూడా పిలవలేదు’ అంటూ ఒంగోలు పార్లమెంట్‌ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక పోలీసు శిక్షణ కళాశా లలో జరిగిన కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన ఆయన ప్రసంగిస్తూ.. ‘నిధుల మంజూరు కోసం ఒక ఎస్పీ వస్తారు, మధ్యలో ఒకరు మారిపోతారు, తర్వాత వచ్చిన వారికి నిధులు ఇచ్చిన వారు గుర్తుండటం లేదు’ అని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎంపీ నిధులు తీసుకుంటున్న పోలీసు అధికారులు రికార్డు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పోలీసు శిక్షణ కళాశాల అభివృద్ధి కోసం తన సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం అభివృద్ధి కోసం రూ.25లక్షల నిధులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. అయితే పోలీసు శాఖకు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉండే మాగుంట అలా వేదికపైనే ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.

Updated Date - Dec 23 , 2025 | 01:23 AM