Share News

నేను మంత్రిగారి ఇలాకా...!

ABN , Publish Date - Nov 26 , 2025 | 02:40 AM

గనులు, భూగర్భ వనరుల శాఖ కార్యాలయంలో ఓ అధికారి పనితీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ‘నేను మంత్రిగారి ఇలాకా’ అంటూ ఆయన కార్యాలయంలో అన్ని పనులను చక్కబెడుతున్నారు. ఈనెల 23న ఒంగోలులోని దక్షిణ బైపాస్‌ రోడ్డులో గనులు శాఖ కార్యాలయ భవన నిర్మాణం కోసం ఇరువురు మంత్రులు భూమిపూజ చేశారు.

నేను మంత్రిగారి ఇలాకా...!

రెచ్చిపోతున్న అధికారి

మైనింగ్‌ శాఖలో కోల్డ్‌వార్‌

కార్యాలయ భవనానికి భూమిపూజలో ప్రస్ఫుటం

ఒంగోలు క్రైం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : గనులు, భూగర్భ వనరుల శాఖ కార్యాలయంలో ఓ అధికారి పనితీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ‘నేను మంత్రిగారి ఇలాకా’ అంటూ ఆయన కార్యాలయంలో అన్ని పనులను చక్కబెడుతున్నారు. ఈనెల 23న ఒంగోలులోని దక్షిణ బైపాస్‌ రోడ్డులో గనులు శాఖ కార్యాలయ భవన నిర్మాణం కోసం ఇరువురు మంత్రులు భూమిపూజ చేశారు. ఈ కార్యక్ర మంలో అంతా తానే అన్నట్లుగా పనులు చక్కబెట్టిన అధికారి శిలాఫలకంపై వేసిన పేర్ల విషయంలో కూడా వివాదాస్పదులుగా మారారు. ఎక్కడా భూగర్భ గనుల శాఖ కార్యాలయం సిబ్బంది అని రాయకపోవడంతో అక్కడ పనిచేసే వారంతా మనస్తాపానికి గురయ్యారు. దీంతో కార్యక్రమానికి ముందురోజైన శనివారం సాయంత్రమే విషయాన్ని కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నతాధికారి దృష్టికి సిబ్బంది తీసుకెళ్లారు. తాము ఆదివారం జరిగే భూమి పూజకు రాలేమని స్పష్టం చేశారు. ఆయన వారికి సర్దిచెప్పారు. అదేసమయంలో గనుల శాఖలో మరో విభాగంలో పనిచేసే అధికారి తన పేరు శిలాఫలకం మీద లేకపోవడాన్ని గుర్తించారు. దీంతో కోపోద్రిక్తుడైన ఆయన తన కంటే తక్కువ స్థాయి అధికారుల పేర్లు శిలాఫలకం మీద ఉన్నాయి.. తన పేరు లేకపోవడం ఏమిటి? అని ఉన్నతాధికారిని ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో ఉన్నతాధికారి తనకేమీ తెలియదని వెంటనే మార్పులు చేయిస్తానని చెప్పి, ఆ అధికారి పేరును ప్రింట్‌ చేసిన స్టిక్కర్‌తో వేయించారు. కార్యాలయంలో తాను మంత్రి ఇలాకా అని చెప్పుకునే అధికారి నిర్వాకం సిబ్బంది, అధికారుల మధ్య కోల్డ్‌వార్‌గా మారింది.

Updated Date - Nov 26 , 2025 | 02:40 AM