అడవిలో వేట నిషేధం
ABN , Publish Date - Sep 28 , 2025 | 10:45 PM
అడవిలో వన్యప్రాణులను వేటాడడం నిషేధమని ఫారెస్ట్ రేంజ్ అధికారి హరి అన్నారు. మండలంలోని పనుకుమడుగు గిరిజన గూడెంలో దసరా పండుగ సందర్భంగా వేటాడటం వంటి చర్యలపై ఆదివారం చెంచు గిరిజనులకు ఆయన అవగాహన కల్పించారు.
గూడెంవాసులకు అధికారుల అవగాహన
పెద్దదోర్నాల, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : అడవిలో వన్యప్రాణులను వేటాడడం నిషేధమని ఫారెస్ట్ రేంజ్ అధికారి హరి అన్నారు. మండలంలోని పనుకుమడుగు గిరిజన గూడెంలో దసరా పండుగ సందర్భంగా వేటాడటం వంటి చర్యలపై ఆదివారం చెంచు గిరిజనులకు ఆయన అవగాహన కల్పించారు. హరి మాట్లాడుతూ వన్యప్రాణులు ఎంత స్వేచ్ఛగా మనగలుగుతాయో మనం అంత ఆరోగ్యంగాజీవిస్తామని చెప్పారు. ముఖ్యంగా అడవిని నమ్ముకుని జీవించే గిరిజనులు వన్యప్రాణుల సంరక్షణ విషయంలో బాధ్యతగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్‌వో చెన్నయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
మార్కాపురం : వన్యప్రాణి సంరక్షణ, అటవీ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగివుండాలని మా ర్కాపురం ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్.పిచ్చిరెడ్డి అన్నా రు. పూలసుబ్బయ్య కాలనీ, బాపూజీ కాలనీ, భగత్‌సింగ్ కాలనీ ప్రాంతాల్లో వన్యప్రాణి సంరక్షణ, అటవీ చట్టాలపై రూపొందించిన పోస్టర్‌లతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వన్యప్రాణులను వేటాడడం నేరమన్నారు. అటువంటి సంఘటనలకు పాల్పడితే శిక్ష లు తప్పవన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో జి.నాగరాజుగౌడ్, ఎఫ్‌బీవోలు జి.రవికుమార్, బాలకుమారి, ఏడుకొండలు, ధనలక్ష్మి, రామసుబ్బారావు పాల్గొన్నారు.