Share News

25న ఒంగోలులో భారీ జాబ్‌ మేళా

ABN , Publish Date - Oct 21 , 2025 | 10:23 PM

ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన ఒంగోలులోని ఏకేవీకే డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ పీ రాజాబాబు తెలిపారు.

25న ఒంగోలులో భారీ జాబ్‌ మేళా
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు కలెక్టరేట్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన ఒంగోలులోని ఏకేవీకే డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ పీ రాజాబాబు తెలిపారు. స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో మంగళవారం జాబ్‌ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంటర్‌ నుంచి పీజీ వరకు ఉన్న అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివిధ కంపెనీల్లో వెయ్యికిపైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. వేతనాలు రూ.11వేల నుంచి రూ.35వేల వరకు ఉండగా కొన్ని కంపెనీలు ప్రోత్సాహకాలు, ఇతర భత్యాలు కూడా అందిస్తాయని తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జే రవితేజ పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2025 | 10:23 PM