మురుగు ముందుకు కదిలేదెలా..?
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:34 AM
డ్రైనేజ్ కాలువలోని విద్యుత్ స్తంభాలతో మురుగు నీరు మందుకు కదలని దుస్థితి నెలకొంది.
పర్చూరు, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : డ్రైనేజ్ కాలువలోని విద్యుత్ స్తంభాలతో మురుగు నీరు మందుకు కదలని దుస్థితి నెలకొంది. పర్చూరు ప్రధాన రహదారిలో పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో డ్రెయి నేజీ కాలువలో విద్యుత్‌స్తంభం ఉంది. ఏళ్ల తరబడి ఈ స్తంభంతో మురుగునీటి పారుద లకు ఇబ్బంది వస్తోంది. దీనికి తోడు స్తంభం కూడా శిథలమైంది. కిందివైపున తుప్పుతిని పడిపోయే విధంగా ఉంది. అయినా ఆ శాఖ అధికారులు ఈ స్తంభాన్ని మార్చడం లేదు.
ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా కునారిల్లిన విద్యుత్‌స్తంభాలను తొలగించి నాణ్యమైన సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ, ఇలా డ్రెయినేజ్ కాలువలో శిఽథిలమైన స్తంభాన్ని తొలగించక పోవటం విచారకరం. ప్రస్తుతం ఉన్న ఇనుప విద్యుత్ స్తంభం మురుగు కాలువలో ఉండడంతో పారిశుధ్య కార్మికులకు విద్యుత్ షాక్ ప్రమాదం చోటుచేసుకుంటుందోనని ప్రజలు భయపడు తున్నారు. దీంతో పాటు ఆయా గ్రామాల్లో అనేక ఇనుప స్తంభాలు కునారిల్లి ప్రమాద భరితంగా మారినా, వాటిని తొలగించే నాథుడే కరువయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డ్రెయినేజీలోని స్తంభాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థాని కులు కోరుతున్నారు. ఆ దిశగా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.