Share News

త్వరితగతిన గృహాలను నిర్మించుకోవాలి

ABN , Publish Date - May 20 , 2025 | 10:36 PM

హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా గృహాలు నిర్మించుకొంటున్న లబ్ధిదారులకు రాష్ట్రప్రభుత్వం అదనంగా నిధులు కేటాయిస్తుందని డీఈ కోటిరెడ్డి తెలిపారు. మండలంలోని ఇనిమెర్ల గ్రామంలోని ప్రభుత్వ లేఔట్‌లో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను మంగళవారం పరిశీలించారు.

త్వరితగతిన గృహాలను నిర్మించుకోవాలి
నిర్మాణంలో ఉన్న గృహాలను పరిశీలిస్తున్న హౌసింగ్‌ డీఈ కోటిరెడ్డి

డీఈ కోటిరెడ్డి

పామూరు, మే 20 (ఆంధ్రజ్యోతి): హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా గృహాలు నిర్మించుకొంటున్న లబ్ధిదారులకు రాష్ట్రప్రభుత్వం అదనంగా నిధులు కేటాయిస్తుందని డీఈ కోటిరెడ్డి తెలిపారు. మండలంలోని ఇనిమెర్ల గ్రామంలోని ప్రభుత్వ లేఔట్‌లో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వ లేఔట్‌లో ఇంటి నివేశన స్థలాలు పొందిన లబ్ధిదారులు త్వరితి గతిన నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు. నిర్మాణ పనులు ప్రారంభించకపోతే లబ్ధిదారుల ఇంటి పట్టాలను రద్దు చేస్తామని తెలిపారు. జూలై 12 తేది నాటికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 3 లక్షల గృహ ప్రవేశాల కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గంలో 874 గృహాలకు గాను ఇప్పటికి 401 గృహాలను పూర్తి చేసినట్టు చెప్పారు. మిగిలిన 473 గృహాల లక్ష్యాలను అధిక మించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎల్‌.బ్రహ్మయ్య, హౌసింగ్‌ ఏఈ రాజమోన్‌రెడ్డి, ఏపీవో బి.మాల్యాద్రి, కార్యదర్శి జి.నాగేశ్వరరావు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మనోహర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2025 | 10:36 PM