Share News

అధునాతన సౌకర్యాలతో వసతిగృహం

ABN , Publish Date - Jun 19 , 2025 | 11:12 PM

దొనకొండ లోని ఎస్సీ-1 బాలుర వసతిగృహం సరికొత్త సౌకర్యా లతో రూపుదిద్దుకొంది. గత వైసీపీ ప్రభుత్వంలో వసతి గృహాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం ఏమా త్రం దృష్టిపెట్టలేదు. దీంతో విద్యార్థులు పడరాని పా ట్లు పడ్డారు. అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభు త్వం ఆరు నెలల్లోనే వసతి గృహాల్లో నెలకొన్న సమస్య ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించింది.

అధునాతన సౌకర్యాలతో వసతిగృహం
వసతిగృహంలో ఆకర్షణీయంగాతయారైన స్టడీ ప్లాట్‌ఫాం

గత వైసీపీ పాలనలో దయనీయం

రూ.26 లక్షలతో మరమ్మతులు

చేపట్టిన ప్రస్తుత ప్రభుత్వం

విద్యా సంవత్సరం ప్రారంభానికి సర్వంసిద్ధం

తల్లిదండ్రుల ఆనందం

దొనకొండ, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): దొనకొండ లోని ఎస్సీ-1 బాలుర వసతిగృహం సరికొత్త సౌకర్యా లతో రూపుదిద్దుకొంది. గత వైసీపీ ప్రభుత్వంలో వసతి గృహాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం ఏమా త్రం దృష్టిపెట్టలేదు. దీంతో విద్యార్థులు పడరాని పా ట్లు పడ్డారు. అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభు త్వం ఆరు నెలల్లోనే వసతి గృహాల్లో నెలకొన్న సమస్య ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజ నేయస్వామి జిల్లాలో వసతి గృహాల్లో చదువుకునే పే ద విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

ఈనేపథ్యంలో దొనకొండ ఎస్సీ-1 బాలుర వసతి గృహంలో అధునాత న సౌకర్యాల రూపకల్పనకు రూ. 26 లక్షలు మంజూరుచేసింది. ఈ నిధుల తో వసతి గృహంలో స్టడీ ప్లాట్‌ఫాం, వాష్‌ ప్లాట్‌పాం, భవనం మొత్తం విద్యుత్‌ సౌకర్యం, బాత్‌రూమ్స్‌, టా యిలెట్స్‌ మరమ్మతులు, పెయింటిం గ్స్‌, ప్రధాన గేట్‌ నుంచి టైల్స్‌తో రహదారి, తదితర మౌలిక సౌకర్యాల ను సమకూర్చారు.

ప్రస్తుతం ఈ వసతిగృహంలో 3 నుంచి పదో తరగతికి చెందిన 190 మంది విద్యార్థులు ఉంటున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం రోజు నుంచి విద్యార్థులను వసతిగృహంలో చేర్పించేందుకు వచ్చిన తల్లిదండ్రులు అభివృద్ధి పనులు చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈఏడాది వసతిగృహంలో అడ్మిషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Updated Date - Jun 19 , 2025 | 11:12 PM