ఘర్షణపడిన హోంగార్డులపై వేటు
ABN , Publish Date - Nov 22 , 2025 | 02:36 AM
సాగర్ కవచ్ బందోబస్తుకు వచ్చి మద్యం సేవించి ఘర్షణ పడిన ముగ్గురు హోంగార్డులపై వేటు పడింది. వారిలో ఇద్దరిని సస్పెండ్ చేసిన ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, మరొకరిని వీఆర్‌కు పిలిచారు.
ఇద్దరు సస్పెన్షన్, వీఆర్‌కు ఒకరు
విచారణకు ఆదేశించిన ఎస్పీ
ఒంగోలు క్రైం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : సాగర్ కవచ్ బందోబస్తుకు వచ్చి మద్యం సేవించి ఘర్షణ పడిన ముగ్గురు హోంగార్డులపై వేటు పడింది. వారిలో ఇద్దరిని సస్పెండ్ చేసిన ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, మరొకరిని వీఆర్‌కు పిలిచారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. సాగర్ కవచ్‌లో భాగంగా ఒంగోలులో విధులు నిర్వహించేందుకు వచ్చిన హోంగార్డులు తంగిరాల ప్రశాంత్‌కుమార్, చెరుకూరి బాలసుబ్రమణ్యం, షేక్ యాసిన్ నగరంలోని ఓ లాడ్జిలో బస చేశారు. ఈనెల 19వతేదీన మద్యం సేవించి ఘర్షణ పడ్డారు. దీంతో ఎస్పీ వారిపై చర్యలు తీసుకున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించే వారిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.