Share News

పొగాకు కొనుగోళ్లకు 23వరకు సెలవు

ABN , Publish Date - Oct 19 , 2025 | 01:36 AM

దక్షిణాది పొగాకు వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు వరుసగా నాలుగు రోజులు నిలిచిపోనున్నాయి. దీపావళి పండుగ నేపథ్యంలో ఈనెల 23 వరకు బోర్డు అధికారులు సెలవులు ప్రకటించారు.

పొగాకు కొనుగోళ్లకు 23వరకు సెలవు

దీపావళి సందర్భంగా నాలుగు రోజులు వేలం కేంద్రాల మూత

ఒంగోలు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు వరుసగా నాలుగు రోజులు నిలిచిపోనున్నాయి. దీపావళి పండుగ నేపథ్యంలో ఈనెల 23 వరకు బోర్డు అధికారులు సెలవులు ప్రకటించారు. 19వతేదీ ఆదివారం కాగా, సోమ వారం దీపావళి పండుగ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. 21,22 తేదీలు కూడా వేలం కేంద్రాల నిలిపివేతకు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దక్షిణాది పొగాకు మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభించి ఏడు మాసాలు పూర్తయ్యింది. పలు కంపెనీల బయ్యర్లు, సిబ్బంది సెలవులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ లోపే కర్ణాటకలో వేలం ప్రారంభం కావడంతో వారిపై మరింత ఒత్తిడి పెరిగింది. దీంతో నాలుగు రోజులు వేలం కేంద్రాలకు సెలవులు ఇవ్వాలని పొగాకు కంపెనీల ప్రతినిధులు కోరినట్లు సమాచారం. అందుకు బోర్డు అధికారులు అంగీకరించ డంతో 19నుంచి 22 వరకు వరుసగా నాలుగు రోజులు వేలం కేంద్రాలలో కొనుగోళ్లు అగిపోనున్నాయి. తిరిగి వేలం ప్రక్రియ 23వ తేదీ ప్రారంభం కానుంది. బోర్డు ఆర్‌ఎం, అలాగే వేలం కేంద్రాల కార్యాలయాలు మాత్రం పనిచేస్తాయి.

Updated Date - Oct 19 , 2025 | 01:36 AM