భైరవకోనను దర్శించుకున్న హైకోర్టు జడ్జి
ABN , Publish Date - Nov 15 , 2025 | 10:54 PM
సీఎస్‌పురం మం డలంలోని భైరవకోన క్షేత్రాన్ని హైకోర్టు జడ్జి సుజాత శనివారం సందర్శిం చారు. ఆలయంలోని త్రీముఖ దుర్గాదేవి అమ్మవారిని, నగరేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.
సీఎస్‌పురం(పామూరు), నవంబరు 15(ఆంధ్రజ్యోతి): సీఎస్‌పురం మం డలంలోని భైరవకోన క్షేత్రాన్ని హైకోర్టు జడ్జి సుజాత శనివారం సందర్శిం చారు. ఆలయంలోని త్రీముఖ దుర్గాదేవి అమ్మవారిని, నగరేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అభిషేక పూజలు, కుంకుమార్చన పూ జలు, ప్రత్యేక పూజలు చేశారు. శేషవస్త్రాలతో సన్మానించి తీర్థప్రదసాదాలు అందజేశారు. కార్యక్రమంలో కనిగిరి జూనియర్ కోర్టు న్యాయాధికారి బి.రూపశ్రీ, ఆలయ చైర్మన్ ముప్పాళ్ళ శ్యాంసుందర్ రాజు, ఈవో వంశీకృష్ణారెడ్డి, తది తరులు పాల్గొన్నారు.