వర్షంతో అస్తవ్యస్తం
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:02 AM
రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి.
వర్షాలకు దెబ్బతిన్న పొలాలు
స్తంభించిన జనజీవనం
పర్చూరు, అక్టోబరు 23 (ఆంఽధ్రజ్యోతి): రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఓ వైపు పంట పొలాలతోపాటు, రహదారుల్లో నీరు నిలిచి జనజీవనం స్తంభించింది. నియోజకవర్గ పరిధిలోని కేశవరప్పాడు - తిమిడ్తిపాడు మధ్య ఆలేరు వాగులో పొంగింది. అదేవిఽధంగా ఇంకొ ల్లు మండలం వంకాలపాడు - పూసపాడు మధ్య వాగు ఉదృతంగా ప్రవహించింది. దీంతో ఆ మార్గంలో రాక పోకలు నిలిచిపోయాయి. పర్చూరు వాగుకు భారీ స్థాయిలో నీరు చేరి ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో కరకట్టలు తెగి తమ పంట పొలాలను ముంచెతు ్తతాయని అన్నదాతలు అందోళన చెందుతు న్నారు.
పోలీసు బందోబస్తు
వాగులు పొంగిపొరలుతుండటంతో ఆయా మార్గా లను రాకపోకలు సాగించకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంతో ఆయా మార్గాల్లో వాగులు పొంగి వాహన దారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘనలు అనేకం ఉన్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై బందోబస్తు నిర్వహించారు.
పర్చూరు : అంతంత మాత్రంగానే సాగైన ఖరీఫ్ పైర్లపై వర్షం పగపట్టింది. ప్రస్తుతం ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే సాగులోని పైర్లు దెబ్బతింటున్నాయి. ఈ ఏడాదైనా కలిసి రాకపోతుందా..? అన్న ఆశతో మిర్చి సాగు చేసుకున్న రైతులకు సాగు ప్రారంభంలోనే నష్టాలు మొదల య్యాయి. భారీ వర్షాలు ఫైర్లను ముంచెత్తటంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో అన్నదాతలు ఉన్నారు. ఇక రబీ సాగు కోసం సిద్ధం చేసుకున్న పొలాలు సైతం బీళ్లగా మారాయి.
బల్లికురవ : మండలంలోని పలు గ్రామాలలో గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి పంటతో పాటు, పొగాకు, జూటు, కంది, కూరగాయాల పంటలు దెబ్బతిన్నాయని రైతులు పేర్కొంటున్నారు. వర్షపునీరు బయటకు పోవడంతో సాగులో ఉన్న పంటలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. ఇప్పటి వరకు ఆశాజనంగా ఉందనుకున్న పత్తిలో పూత రాలి పోయింది. కాయలు కుళ్లిపోతున్నాయి. పొగాకు మొక్కలు కుళ్లి పోతాయని రైతులు పేర్కొంటున్నారు. ఇక ఇప్పటికే నాటేసిన మిరపలో మొక్కలు చని పోతున్నాయి. భారీ వర్షాల వలన బల్లికురవ మార్టురు రోడ్డులో అడవి తుమ్మ చెట్లు రోడ్డు మధ్యలో పడిపోయింది. దీంతో భారీ వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. గుంటుపల్లి చెరువు వర్షాల వలన నిండింది. దీంతో చెరువు అలుగు పారుతుండటంతో దిగువ భాగంలో మాగాణి సాగు చేసిన రైతుల్లో ఆందోళన నెలకోంది. భారీ వర్షాలు ఇంకా పడితే వరి పంట మునిగి పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
చీరాల : రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రామీణ ప్రాంతాల్లోని నివాసాల్లోకి నీళ్లు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇళ్లల్లో ఉండలేక, వర్షంలో బయటకు పోలేక బిక్కుబిక్కు మంటున్నారు. మరోవైపు ప్రధాన రహదారులు సైతం నీళ్లుతో నిండి వాగులను తలపిస్తున్నాయి. ఈక్రమంలో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే సహాయక చర్యలు చేపట్టిన తహసీల్దార్ గోపీకృష్ణ జాండ్రపేట హైస్కూల్‌కు కొన్ని ముంపు గ్రామాలకు చెందిన వారిని తరలించి భోజన సౌకర్యాలు కల్పించారు. మరో రెండు రోజులు అల్పపీడన ప్రభావం ఉండటంతో ప్రజలు భీతిల్లుతున్నారు. డ్రెయిన్లు, వర్షపు నీరు ఏకమై వార్డులు దుర్ఘంధభరితమయ్యాయి. రోగాలు ప్రభలే అవకాశం ఉంటడంతో జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
యద్దనపూడి,(మార్టూరు) :తుఫాను కారణంగా బుధవారం రాత్రి, గురువారం ఉదయం మండలంలో కురిసిన భారీ వర్షాలకు వాగులు,వంకలు పొంగిప్రవహిస్తున్నాయి.పొలాల్లో కూడా నీళ్లు భారీగా నిలబడ్డాయి. దీంతో నల్లరేగడి పొలాలు కావడంతో, పొలాల్లో నిలబడిన వర్షపునీరు చెరువులను తలపిస్తున్నాయి. యద్దనపూడి మండలంలో ముఖ్యంగా పోలూరు వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. తూముల చప్టాపై గుండా నీరు ఉఽధృతంగా ప్రవహిస్తుండడంతో పోలూరు గ్రామానికి, మిగిలిన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అదేవిధంగా యద్దనపూడి నుంచి కుమ్మరిపాలెం, వింజనంపాడు గ్రామాలకు వెళ్లే రహదారిలో నేలచప్టాపై వర్షపునీరు భారీగా ప్రవహిస్తుండటంతో ప్రజల రాకపోకలు నిలిచాయి. యనమదల, చింతపల్లిపాడు, యద్దనపూడి పొలాల్లో భారీగా వర్షపునీళ్లు నిలిచాయి. అదేవిదంగా యనమదల గ్రామంలో రోడ్డుపై ఏర్పడిన గుంతలలో వర్షపు నీళ్లు నిలబడటంతో గోతులు అర్దంకాక వాహనదారులు చాలా ఇబ్బందులకు గురయ్యారు.
మొలకెత్తిన మినుము
పంగులూరు : అధికవర్షంతో మినుముకు అపారనష్టం వాటిల్లింది. కాయ మీద ఉన్న మినుములు చేలోనే మొలకెత్తాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో మండలంలోని పలు గ్రామాల రైతులు రెండున్నరవేల ఎకరాలకు పైగా మినుముసాగు చేపట్టారు. వెయ్యి ఎకరాలలో పైరు కోతకోయాల్సి ఉండగా మిగిలిన విస్తీర్ణంలో పైరుపూత, పిందెదశకు చేరుకుంది. రుతుపవనాలతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వారం రోజులుగా పడుతున్న వర్షంతో మినుము పైరు కోతకోయలేని పరిస్థితి ఉంది. వారం రోజుల వ్యవధిలో మండలంలో ఇంచుమించు 8 సెంటీమీటర్ల వర్షం పడింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో కోతఽకునోచుకోని మినుముపైరులో కాయనాని గింజ మొలకెత్తడంతో పంటచేతికి దక్కదని రైతులు వాపోతున్నారు. మినుము సాగుచేసిన రైతులలో సింహభాగం కౌలురైతులు కాగా, ఎకరాకు రూ. 20వేలు కౌలుతో పాటు సాగుకు రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టారు. అధిక వర్షాలతో పూర్తిగా నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. 1000 ఎకరాల్లో మినుము మొలకరాగా, మరో 1500 ఎకరాలలో పూతదశకు చేరుకుంది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న అధిక వర్షం తో మినుములో పూతరాలే పరిస్థితి ఏర్పడుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.