Share News

పత్తికి అధిక నష్టం

ABN , Publish Date - Oct 26 , 2025 | 01:03 AM

వరుసగా నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలతో పత్తికి అధిక నష్టం వాటిల్లింది. వర్షం తెరపిచ్చి రెండు రోజులు గడుస్తున్నా ఇంకా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీటిలోనే ఉన్నాయి. మరోవైపు కోతదశలో ఉన్న పంటలపైనా వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

పత్తికి అధిక నష్టం
పగిలిన పత్తి కాయల్లోకి నీరు చేరి రంగు మారిన దృశ్యం

సాగు చేసిన పంటలో 31శాతానికి పైగా దెబ్బతిన్న వైనం

నేటికీ నీటిలోనే వే లాది ఎకరాలు

తాజా అంచనా ప్రకారం 152 గ్రామాల్లో దెబ్బతిన్న పంటలు

ఒంగోలు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : వరుసగా నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలతో పత్తికి అధిక నష్టం వాటిల్లింది. వర్షం తెరపిచ్చి రెండు రోజులు గడుస్తున్నా ఇంకా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీటిలోనే ఉన్నాయి. మరోవైపు కోతదశలో ఉన్న పంటలపైనా వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వ్యవ సాయశాఖ తాజా అంచనా ప్రకారం పత్తికి అధిక నష్టం వాటిల్లనుంది. అదికూడా మార్కాపురం, పెద్దారవీడు మండలాల్లోనే ఎక్కువ ఉన్నట్లు ఆ శాఖ అధికారులు గుర్తించారు. జిల్లాలో వ్యవసాయశాఖ తాజా అంచనాల ప్రకారం 21 మండలాల్లోని 152 గ్రామాల్లో పంటలపై వర్ష ప్రభావం ఉంది. ఆ పరిధిలో 8,888 మంది రైతులకు చెందిన 7,942 హెక్టార్లలో 8 రకాల పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఒక్క పత్తి పంటే 5,838 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు గుర్తించారు. జిల్లాలో మొత్తం సాగైన పత్తి పంటలో సుమారు 31శాతానికి పైగా విస్తీర్ణంలో దెబ్బతింది. అందులో మార్కాపురం మండలంలో 2,780 హెక్టార్లు, పెద్దారవీడు మండలంలో 1,508 హెక్టార్లు ఉంది. అలాగే సజ్జ, జొన్న, కంది, వేరుశనగ, వరి, మినుము, మొక్కజొన్న తదితర పంటలు కూడా దెబ్బతిన్నట్లు గుర్తించారు.

Updated Date - Oct 26 , 2025 | 01:03 AM