Share News

పోషకాహారంతో ఆరోగ్యం

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:02 PM

పోషకాహారంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఐసీడీఎస్‌ మార్కాపురం క్లస్టర్‌ సీడీపీవో పద్మ కోరారు. ఎస్సీ, బీసీ కాలనీలోని డ్వాక్రా బజారులో జాతీయ పోషకాహర మాసోత్సవాల సందర్భంగా గర్భిణులు, తల్లులు వారి కుటుంబ సభ్యులకు పోషకాహరంపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.

పోషకాహారంతో ఆరోగ్యం
పోషకారంపై వివరిస్తున్న అంగన్‌వాడీలు

మార్కాపురం రూరల్‌, సెప్టెంబరు23 (ఆంధ్రజ్యోతి) : పోషకాహారంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఐసీడీఎస్‌ మార్కాపురం క్లస్టర్‌ సీడీపీవో పద్మ కోరారు. ఎస్సీ, బీసీ కాలనీలోని డ్వాక్రా బజారులో జాతీయ పోషకాహర మాసోత్సవాల సందర్భంగా గర్భిణులు, తల్లులు వారి కుటుంబ సభ్యులకు పోషకాహరంపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసి ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు, పండ్లతో అందే పోషకాలను వివరించారు. వెలుగు ఏపీఎం పిచ్చ య్య మాట్లాడుతూ మహిళలు తమ ఇంటి పరిసరాలలో ఎటువంటి రసాయనాలు వాడని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పెంచుకుని తింటే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌లు, కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 11:02 PM