వైద్యారోగ్యశాఖ అప్రమత్తం
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:19 AM
మొంథా తుఫాన్ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. డాక్టర్లు, ఇతర సిబ్బంది సెలవులను రద్దు చేశారు. ఆయా వైద్యశాలలకు అత్యవసర మందులను సరఫరా చేశారు. 108 వాహనాలు 40, 104 వాహనాలు 38, 102 వాహనాలు 18 కలిపి 96వాహనాలను అందుబాటులో ఉంచారు.
అన్ని ఆస్పత్రుల్లో అత్యవసర మందులు ఏర్పాటు
నిండు గర్భిణిలు సమీపంలోని వైద్యశాలలకు తరలింపు
డాక్టర్లు, సిబ్బంది సెలవులు రద్దు.. అంబులెన్స్‌లు సిద్ధం
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : మొంథా తుఫాన్ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. డాక్టర్లు, ఇతర సిబ్బంది సెలవులను రద్దు చేశారు. ఆయా వైద్యశాలలకు అత్యవసర మందులను సరఫరా చేశారు. 108 వాహనాలు 40, 104 వాహనాలు 38, 102 వాహనాలు 18 కలిపి 96వాహనాలను అందుబాటులో ఉంచారు. అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు ప్రైవేటు అంబులెన్స్‌లను కూడా సిద్ధం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వారం, పది రోజుల్లో కాన్పు అయ్యే గర్భిణులను ముందస్తుగానే వైద్యశాలలకు తరలించారు. ప్రజలకు అత్యవసర సమయాల్లో వైద్యసేవలు అందించేందుకు మూడు ప్రత్యేక బృందాలు, అన్ని వైద్యశాలల్లో కంట్రోలు రూంలను ఏర్పాటు చేశారు. అత్యవసరం అయితే నర్సింగ్ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో తదనుగుణంగా చర్యలు తీసుకున్నారు.