సీఎంఆర్‌ఎ్‌ఫతో ఆరోగ్య భరోసా
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:24 AM
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆరోగ్య భరోసా లభిస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తెలిపారు. సోమవారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో 52 మంది లబ్ధిదారులకు రూ. 60. 99 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఒంగోలు కార్పొరేషన్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆరోగ్య భరోసా లభిస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తెలిపారు. సోమవారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో 52 మంది లబ్ధిదారులకు రూ. 60. 99 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ నిరుపేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా ఉంటుందన్నారు. పేద, మధ్య తరగతివారు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడకుండా వారి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం అందజేస్తున్న నగదు లబ్ధిదారులకు సహాయపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు బండారు మదన్, మహిళ అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.