సీఎంఆర్‌ఎ్‌ఫతో ఆరోగ్య భరోసా
ABN , Publish Date - Sep 02 , 2025 | 10:30 PM
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు ఆరోగ్య భరోసా లభిస్తోందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ చెప్పారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 107 మంది లబ్ధిదారులకు 88లక్షల 38 వేల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు.
ఎమ్మెల్యే దామచర్ల
ఒంగోలు కార్పొరేషన్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు ఆరోగ్య భరోసా లభిస్తోందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ చెప్పారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 107 మంది లబ్ధిదారులకు 88లక్షల 38 వేల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ అనారోగ్య సమయంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి కార్పొరేట్ వైద్యం అందించడం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు సీఎంఆర్‌ఎఫ్ సహకారంతో మెరుగైన వైద్యం పొంది ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే జనార్దన్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, జనసేన జిల్లా నాయకులు కంది రవిశంకర్, నగర అధ్యక్షులు బండారు మదన్ పాల్గొన్నారు.