Share News

హెచ్‌డీఎస్‌ నిధులు విడుదల

ABN , Publish Date - Aug 12 , 2025 | 02:40 AM

జిల్లాకు హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ (హెచ్‌డీఎస్‌) నుంచి మొదటి విడత రూ.56.55లక్షలు విడుదలయ్యాయి. అందులో ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఎంసీహెచ్‌లకు ఒక్కోదానికి రూ.1.60లక్షలు కేటాయించారు.

హెచ్‌డీఎస్‌ నిధులు విడుదల

జిల్లాకు తొలి విడత రూ.56.55 లక్షలు

ప్రభుత్వ వైద్యశాలలకు కేటాయింపు

ఒంగోలు కలెక్టరేట్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకు హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ (హెచ్‌డీఎస్‌) నుంచి మొదటి విడత రూ.56.55లక్షలు విడుదలయ్యాయి. అందులో ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఎంసీహెచ్‌లకు ఒక్కోదానికి రూ.1.60లక్షలు కేటాయించారు. జిల్లాలోని 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కోదానికి రూ.60వేల చొప్పున ఇచ్చారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణ, అత్యవసర మందుల కొనుగోలుకు ఏటా కేంద్రం హెచ్‌డీఎస్‌ నుంచి నిధులు ఇస్తోంది. ఈ ఏడాది ఒక్కో పీహెచ్‌సీకి 1.75లక్షలు, ఇతర వైద్యశాలలకు రూ.5లక్షలు రావాల్సి ఉంది. అందులో తొలివిడత నిధులను విడుదల చేసింది. ప్రస్తుతం జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఎంసీహెచ్‌లలో అవసరమైన మేర డబ్బులు లేక వైద్యాధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో కేంద్రం ఇచ్చిన నిధులతో కొంతమేర ఊరట కలగనుంది.

Updated Date - Aug 12 , 2025 | 02:40 AM