ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
ABN , Publish Date - Nov 27 , 2025 | 02:12 AM
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా బుధవారం వివిధ వర్గాల వారు ఘనంగా నిర్వహించారు. ఒకవైపు ప్రభుత్వపరంగా యంత్రాంగం, మరోవైపు దళిత, ప్రజాసంఘాలు, ఇతర సంస్థల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. అంబేడ్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పలు ప్రాంతాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులు.. ప్రతిజ్ఞలు
ఒంగోలులో పాల్గొన్న కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే జనార్దన్
మార్కాపురంలో హాజరైన ఎమ్మెల్యే నారాయణరెడ్డి
ఒంగోలు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా బుధవారం వివిధ వర్గాల వారు ఘనంగా నిర్వహించారు. ఒకవైపు ప్రభుత్వపరంగా యంత్రాంగం, మరోవైపు దళిత, ప్రజాసంఘాలు, ఇతర సంస్థల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. అంబేడ్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ ప్రతిజ్ఞలు, ర్యాలీలు నిర్వహించారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైనదని కొనియాడారు. ఒంగోలులో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో స్థానిక హెచ్‌సీఎం కాలేజీ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పి.రాజాబాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తోపాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. ప్రతిజ్ఞ చేశారు. మార్కాపురం పట్టణంలో జరిగినకార్యక్రమంలో అక్కడ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, అంబేడ్కర్ విగ్రహాల వద్ద రాజ్యాంగ దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. వివిధ వర్గాల ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.