Share News

ప్రజా సేవతో ఆనందం

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:39 AM

నిరంతరం నియోజకవర్గంలో ప్రజా సేవల్లో ఉండడంతో ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పేర్కొన్నారు. గురువారం 216 జాతీయ రహదారి మన్నం అపార్ట్‌మెంట్‌ సమీపంలోని అక్కయ్యపాలెం పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

ప్రజా సేవతో ఆనందం
ఎమ్మెల్యే కొండయ్యను సత్కరిస్తున్న ప్రతినిధులు

ఎమ్మెల్యే కొండయ్య

చీరాల, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి) : నిరంతరం నియోజకవర్గంలో ప్రజా సేవల్లో ఉండడంతో ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పేర్కొన్నారు. గురువారం 216 జాతీయ రహదారి మన్నం అపార్ట్‌మెంట్‌ సమీపంలోని అక్కయ్యపాలెం పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వేసవి దాహార్తికి ఒంగోలు వైపు వెళ్లే వారికి, రామాపురం వెళ్లే పర్యాటకులకు చలివేంద్రం ఎంతగానో దోహద పడుతుందని వివరించారు. అలాగే కొత్తపేటలోని గోపాల్‌నగర్‌ శ్రీసీతారామ మందిరం వద్ద నిర్వహించిన సమారాధనలో పాల్గొన్నారు. ఆయా ప్రాంత ప్రతినిధులు, నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 12:39 AM