Share News

ప్రజాపాలనతో ఇంటింటా సంతోషం

ABN , Publish Date - Jul 14 , 2025 | 11:47 PM

రాష్ట్రంలో విధ్వంస పాలనపోయి ప్రజాపాలన రావడంతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం కురిచేడు మండలం కల్లూరు గ్రామంలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, స్వామి పాల్గొన్నారు.

ప్రజాపాలనతో ఇంటింటా సంతోషం
మాట్లాడుతున్న విద్యుత్‌ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌

ఇంటింటికీ సుపరిపాలన తొలిఅడుగు

మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

కురిచేడు, జూలై 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విధ్వంస పాలనపోయి ప్రజాపాలన రావడంతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం కురిచేడు మండలం కల్లూరు గ్రామంలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, స్వామి పాల్గొన్నారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి రవికుమార్‌ మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి విధ్వంసపాలన సాగించడంతో ప్రజలు విలవిల్లాడిపోయి 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. అయినా ఆయన బుద్ధి మారలేదని ఎద్దేవా చేశారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. మమ్మల్ని ఇంటింటికీ తిప్పుతున్నారని చెప్పారు. అందరూకలసికట్టుగా ముందుగా సాగితే వచ్చే ఎన్నికల్లో దర్శిలో టీడీపీదే విజయమని చెప్పారు.

సాంఘిక సంక్షేమ శాఖమంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ జగన్‌ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రికి అనర్హుడన్నారు. గత ఐదేళ్లు తాడేపల్లి ప్యాల్‌సలో కూర్చొని అప్పుడప్పుడా బయటకు వచ్చినా పరదాలు కట్టించిన ఘనుడు అని విమర్శించారు. ఒకరు మరణిస్తే వారి పరామర్శకు వచ్చి మరో ముగ్గురి ప్రాణాలు తీసిన వ్యక్తి అని ధ్వజమెత్తారు. తన కారు టైరు కింద నలిగి వ్యక్తి ప్రాణాలు పోయినా తనకు తెలియదన్న తప్పించుకున్న వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. నెలకోసారి పాల్యస్‌ నుంచి బయటకు వచ్చి గందరగోళం సృష్టించడం తంతుగా సాగుతోందన్నారు. తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చిన ఘనత ప్రభుత్వానిదేనని చెప్పారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాకారం కాబోతున్నట్టు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఈనెలలో సాయం చేయనున్నట్టు చెప్పారు. అధికారంలోకి రాగానే చెప్పిన విధంగా పింఛన్‌ను రూ.4 వేలకు పెంచి మాట నిలబెట్టుకున్న సీఎంకు ధన్యవాదాలు తెలియజేయాలన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మంత్రులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. నమశ్శివాయపురం, పెద్దవరం గ్రామాల వద్ద విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, డాక్టర్‌ కడియాల లలిత్‌సాగర్‌, దర్శి మున్సిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, టీడీపీ కురిచేడు మండల అధ్యక్షుడు పిడతల నెమిలయ్య, కాట్రాజు నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 11:47 PM