‘సూపర్ సిక్స్’తో ప్రతి ఇంట్లో సంతోషాలు
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:15 AM
కూట మి ప్రభుత్వం అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలతో ప్ర తి ఇల్లూ సంతోషంగా ఉంటుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. సుపరిపాలలో తొలిఅడుగు కా ర్యక్రమాన్ని గురువారం నగరంలోని 3,4 డివిజన్లలో ని ర్వహించారు.

ఎమ్మెల్యే దామచర్ల
3,4 డివిజన్లలో ‘సుపరిపాలనలో తొలిఅడుగు’
ఒంగోలు కార్పొరేషన్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): కూట మి ప్రభుత్వం అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలతో ప్ర తి ఇల్లూ సంతోషంగా ఉంటుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. సుపరిపాలలో తొలిఅడుగు కా ర్యక్రమాన్ని గురువారం నగరంలోని 3,4 డివిజన్లలో ని ర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్ళి కూట మి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజలతో మాట్లాడారు. స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్న దామచర్ల సత్వరం పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్ర భుత్వం అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలన చేసి, అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. పే దరికం లేని ఇల్లు చూడాలని ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజలకి ఇచ్చిన మాట కోసం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు.
ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీలు నెర వేరుస్తున్నట్లు చెప్పారు. తమపై నమ్మకంతో అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడాదిలోపు ఒంగోలు నగరం రూపురేఖలు మార్చి మరింత అభివృద్ధి చేస్తామ ని దామచర్ల స్పష్టం చేశారు. ప్రస్తుతం గుర్తించిన స మస్యలు పరిష్కరించాలని కార్పొరేషన్ అధికారులకు ఆ దేశించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోతురాజు కా లువకు అనుసంధానమైన కచ్చా కాలువలను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రతిరోజు కాలువల్లో పూడికతీత తీయా లని ఆదేశించారు. అలాగే ప్రజల కోరిక మేరకు నీటి సరఫరా సమయాన్ని పెంచాలన్నారు. ప్రజల నుంచి ఫి ర్యాదులు రాకుండా చూడాలని అధికారులకు సూచిం చారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంకు చైర్మన్ కామే పల్లి సీతారామయ్య, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, మాజీ అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, షేక్ కపిల్‌బాషా, కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంఈ ఏస య్య, డీఈ పద్మజ, ఏఈ అంజిరెడ్డి, నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.