ప్రతి కుటుంబంలో సంతోషం
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:13 PM
ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక 14వ బ్లాకులో సోమవారం సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్‌పై అవగాహన ర్యాలీ, ఇంటింటి ప్రచారం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో ప్రజలపై చాలా భారం తగ్గిందన్నారు.
14వ బ్లాకులో సూపర్ జీఎస్టీ
సూపర్ సేవింగ్స్ ర్యాలీలో ఎమ్మెల్యే కందుల
మార్కాపురం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక 14వ బ్లాకులో సోమవారం సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్‌పై అవగాహన ర్యాలీ, ఇంటింటి ప్రచారం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో ప్రజలపై చాలా భారం తగ్గిందన్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు ప్రయోజనం పొందుతున్నారన్నారు. యువతకు ఇప్పటికే 4.75 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించిందన్నారు. మార్కాపురం ప్రత్యేక జిల్లాతోపాటు మెడికల్ కాలేజీ త్వరలోనే పూర్తవుతుందన్నారు. త్వరలో మినీ మిర్చియార్డు ఏర్పాటు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ నారాయణరావు, ఏఎమ్‌సీ ఛైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఇబ్రహీంఖాన్, పార్టీ వైద్యవిభాగం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ షేక్ మౌళాలి, టీడీపీ నాయకులు శ్రీనివాసులు పాల్గొన్నారు.
కోఆప్షన్ సభ్యుడు అమిరుల్లాఖాన్‌కు నివాళి
మార్కాపురం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు పఠాన్ అమిరుల్లాఖాన్ ఆదివారం రాత్రి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సోమవారం ఉదయం స్థానిక 8వ వార్డులోని అమిరుల్లాఖాన్ నివాసానికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
ఎమ్మెల్యేకు బాషా పండితుల కృతజ్ఞతలు
రాష్ట్ర ప్రభుత్వం డీఈవో పూల్ బాషా పండితులకు ఉద్యోగోన్నతులు కల్పించిన నేపథ్యంలో రాష్ట్రోపాధ్యాయ సంఘం నాయకులు సోమవారం ఎమ్మెల్యే కందులను ఆయన స్వగృహంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రవిచంద్రకుమార్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న డీఈవో పూల్ బాషా పండితుల ఉద్యోగోన్నతుల సమస్యను మంత్రి నారా లోకేష్ పరిష్కరించారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాధ్యక్షుడు జీఎల్ రమే్‌షబాబు, డివిజన్ బాధ్యులు విశ్వం, అంజిరెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
రైతులకు మేలు
పొదిలి : జీఎస్టీ తగ్గింపుతో రైతులకు ఎంతోమేలు కలుగుతుందని ఇన్‌చార్జి ఎంపీడీవో గుత్తా శోభన్‌బాబు అన్నారు. సోమవా రం ఎంపీడీవో కార్యాలయం నుంచి విశ్వనాథపురంలో వ్యవసాయ, మున్సిపల్, మండల పరిషత్ కార్యాలయాల ఆధ్వర్యంలో అధికారులు కలిసి జీఎస్టీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలుమాల్స్, ఎరువులు దుకాణాలు, షాపులను సందర్శించి తగ్గిన జీఎస్టీ ధరలను అమలు చేస్తున్నదీ లేనిదీ పరిశీలించారు. ఎరువుల దుకాణదారులు ధరలు తగ్గించలేదని రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన హెచ్చరిక జారీ చేశారు.
పెద్ద దోర్నాల : సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్‌పై టీఎన్‌టీయూసీ ఒం గోలు ప్రధాన కార్యదర్శి ఈదర మల్లయ్య సోమవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. మండలంలోని హసనాబాద్ గ్రా మంలో ఇంటింటికీ తిరిగి ప్రజా ప్రభు త్వం అమలు చేసిన సూపర్‌సిక్స్ పథకాలు, జీఎస్టీ తగ్గింపువల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయనతోపాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
రాచర్ల : జీఎస్టీపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీవో ఎస్.వెంకట రామిరెడ్డి అన్నారు. ఎంఈవో వీ గిరిధర శర్మ ఆధ్వర్యంలో జడ్పీహెచ్‌ఎ్‌స స్కూల్‌లో సోమవారం జీఎస్టీపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నోట్ బుక్స్, మ్యాప్స్, స్టేషనరీలపై జీఎస్టీ తగ్గిందన్నారు. అనంతరం ఆయన ఎంఈవోతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం బీఎల్ రామానాయక్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, నాగేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.