సుపరిపాలనతో అన్నీవర్గాల ప్రజల్లో ఆనందం
ABN , Publish Date - Jul 03 , 2025 | 11:43 PM
ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనలో అన్నీవర్గాల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుందని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు అన్నారు.

మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు
దర్శి, జూలై 3(ఆంధ్రజ్యోతి): టీడీపీ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనలో అన్నీవర్గాల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుందని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు అన్నారు. దర్శి మున్సి పాలిటీలోని శివరాజ్‌నగర్‌లో గురువారం సాయంత్రం కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సం దర్భంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వివరించే కరపత్రా లను ఇంటింటికి తిరిగి ప్రజలకు పంపిణీ చేశారు. పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
ఈసందర్భంగా పాపారావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నో అద్భుతాలు సాధించిం దన్నారు. పరిశ్రమలు వరదలా రాష్ట్రానికి వస్తున్నా యన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సూపర్ సిక్స్ పథకాల అమలుతో అన్నీవర్గాల ప్రజలకు న్యాయం జరుగు తుండటంతో సంతృప్తి వ్యక్తమ వుతుందన్నారు.
కార్యక్రమంలో టీడీపీ మం డల అధ్యక్షుడు మారెళ్ల వెంకటే శ్వర్లు, పట్టణ అధ్యక్షుడు పుల్లల చెరువు చిన్నా, మాజీ అధ్యక్షుడు దారం సుబ్బారావు, యాదగిరి వాసు, సంగా తిరుపతిరావు, జూపల్లి కోటేశ్వరరావు, నారపుశెట్టి మధు, బత్తుల త్రినాథ్, రామగిరి, కుప్పాల సురేష్, నార పుశెట్టి శ్రీనివాసరావు, శోభారాణి, అనూష తదితరులు పాల్గొన్నారు.