Share News

వైభవంగా ముగిసిన గుంటిగంగ తిరునాళ్ల

ABN , Publish Date - Apr 15 , 2025 | 11:58 PM

గుంటిగంగ తిరునాళ్ల సోమవారం రాత్రి వైభవంగా ముగిసింది. దాదాపు రెండులక్షల మందికిపైగా భక్తులు తిరునాళ్లను తిలకించారు. దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో సీఐ రామారావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ మల్లికార్జునరావులు తిరునాళ్ల ప్రాంగణంలో ట్రాఫిక్‌కు అంతరాయం జరుగకుం డా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు.

వైభవంగా ముగిసిన గుంటిగంగ తిరునాళ్ల
తురకపాలెం టీడీపీ ప్రభపై డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్‌లలిత్‌ సాగర్‌ దంపతులను సన్మానిస్తున్న టీడీపీ శ్రేణులు

ట్రాఫిక్‌ నియంత్రణలో

పోలీసుల వైఫల్యం

భక్తుల ఇబ్బందులు

తాళ్లూరు, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): గుంటిగంగ తిరునాళ్ల సోమవారం రాత్రి వైభవంగా ముగిసింది. దాదాపు రెండులక్షల మందికిపైగా భక్తులు తిరునాళ్లను తిలకించారు. దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో సీఐ రామారావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ మల్లికార్జునరావులు తిరునాళ్ల ప్రాంగణంలో ట్రాఫిక్‌కు అంతరాయం జరుగకుం డా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు. అయి తే, ట్రాఫిక్‌ను నియంత్రించలేకపోవటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాలుగువైపులా వాహనాల పా ర్కింగ్‌లు ఏర్పాటుచేయటంతో పాటు పికెట్లు ఏర్పాటుచేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి వాహనాల ను తిరునాళ్ల ప్రాంగణంలోకి రాకుండా నిరోధించి ఉన్న ట్లయితే భక్తులకు ఇబ్బందులు ఉండేదికాదు. పికెట్లు ఏర్పాటు చేసినా పోలీసులు కన్పించిన దాఖాలు లేదు. తూర్పుగంగవరం వెళ్లే మార్గంలో రాత్రి 11 గంటల సమయంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం జరిగి దాదాపు గంటపాటు ట్రాఫిక్‌ నిలిచింది. హైవేరోడ్డు నిర్మాణాలు జరుగుతుండటంతో ప్రజలు ఆరోడ్డు గుండా తిరునాళ్లలోకి ప్రవేశించటం వల్ల ట్రాఫిక్‌కు అంతరా యం ఏర్పడింది. ప్రభల వద్ద మైకుల అధిక శబ్ధంతో భక్తులు చెవులు దిమ్మతిరిగిపోయాయి. దేవదాయశాక ఏర్పాటుచేసిన బారీ కేడ్లతో గంగమ్మ దర్శనానికి వచ్చిన లక్షలాది మంది భక్తులు మునుపెన్నడూ లేనివిధంగా ఎలాంటి తొక్కిసలాటకు గురికాకుండా అమ్మవారిని ద ర్శించుకున్నారు. తురకపాలెం, నాగంబొట్లపాలెం టీడీపీ ప్రభలు, జనసేన ప్రభలపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌ చార్జ్‌ గొట్టిపాటి లక్ష్మి, లలిత్‌సాగర్‌ కార్యకర్తల నుద్దేశించి మాట్లా డారు. తురకపాలెం వైసీపీ ప్రభలపై జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, చేవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడారు. దా దాపు 15 సంవత్సరాల తరువాత విఠలాపురం గ్రామానికి చెందిన కైపు వెంకటకృష్ణారెడ్డి కాంగ్రెస్‌ ప్రభను ఏర్పాటుచేశారు.

ప్రజాసేవే లక్ష్యం

తాళ్లూరు, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): ప్రజాసేవే తన లక్ష్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపా టి లక్ష్మి అన్నారు. తిరునాళ్ల సందర్బంగా తురకపాలెం, నాగంబొట్లపాలెం టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు ఏర్పాటుచేసి ప్రభలపై ప్రజల నుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెం డింటికి ప్రాధాన్యత నిస్తూ రాష్ట్రాభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. దర్శిలో నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవచేస్తూ ముందుకుసాగుతున్నామన్నారు. కార్యక్రమాల్లో టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్‌ లతిత్‌సాగర్‌, తదితరులు పాల్గొన్నారు. కాగా, తురకపా లెం టీడీపీ శ్రేణులకు మండల నేతలపై ఉన్న అసంతృప్తితో టీడీపీ యూత్‌ ఫోర్స్‌ ఏర్పాటుచేసిన ప్రభపైకి మండలస్థాయి నాయకులను ఎవరిని ఆహ్వానించలేదు. ఆగ్రామ యువకులు తీసుకున్న నిర్ణయాన్ని పలుగ్రామాలకు చెందిన నేతలు తప్పుపడుతున్నారు.

గంగమ్మ తల్లికి రూ.7లక్షల ఆదాయం

తాళ్లూరు, ఏప్రిల్‌15 (ఆంధ్రజ్యోతి): గుంటిగంగ తిరునాళ్ల సందర్భంగా గంగా భవానీ అమ్మవారి దేవాలయానికి రూ.7,42,158 ఆదాయం వచ్చిందని ఈవో జి.వాసుబాబు తెలిపారు. మంగళవారం హుండీల్లో కానుకలను లెక్కించారు. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్‌ కొసనా గురుబ్రహ్మం, యు.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 11:58 PM