ప్రమాద స్థాయికి గుండ్లకమ్మ ప్రవాహం
ABN , Publish Date - Oct 30 , 2025 | 10:51 PM
నల్లమలలో కురి సిన వర్షానికి కంభం చెరువు పూర్తిగా నిండి అలుగు పారడంతో అలుగు ద్వారా బేస్తవారపేటలోని సోమవారపేట వద్ద సీతురేలుకతువకు చేరిన నీటి ప్రవాహం ప్రమాదస్థాయికి చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
సప్లై చానల్‌ను వెడల్పు చేసి నీటి మళ్లింపు
ఊపిరిపీల్చుకున్న ప్రజలు
బేస్తవారపేట, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : నల్లమలలో కురి సిన వర్షానికి కంభం చెరువు పూర్తిగా నిండి అలుగు పారడంతో అలుగు ద్వారా బేస్తవారపేటలోని సోమవారపేట వద్ద సీతురేలుకతువకు చేరిన నీటి ప్రవాహం ప్రమాదస్థాయికి చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం ఉదయానికి భారీగా వరద పాడంతో కతువ చానల్ ద్వారా నీరు వెళ్లలేక సమీపంలోని గృహాలు, పంట పొలాల్లోకి చేరింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అధికారులు ఎక్స్‌కవేటర్ సాయంతో సప్లై చానల్‌ను వెడల్పు చేసి నీటిని బయటకు పంపడంతో అది మార్కాపురానికి చేరింది. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. వారితోపాటు మార్కపురం డీఎస్పీ నాగరాజు, సీఐ మల్లికార్జున,తహసీల్దార్ జితేంద్ర, ఇండ్లా శేఖర్‌రెడ్డి ఉన్నారు.