గుండాయపాలెం సర్పంచ్ రాజీనామా
ABN , Publish Date - Dec 09 , 2025 | 01:27 AM
ఒంగోలు మండలం గుండాయపాలెం గ్రామ సర్పంచ్ రేవు సౌజన్య రాజీనామాను జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఆమోదించారు. ఇటీవల సర్పంచ్ పదవికి ఆమె రాజీనామా చేయడంతో దానిపై క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు విచారణ చేశారు.
ఆమోదం తెలిపిన డీపీవో
ఉపసర్పంచ్‌కు చెక్‌పవర్
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు మండలం గుండాయపాలెం గ్రామ సర్పంచ్ రేవు సౌజన్య రాజీనామాను జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఆమోదించారు. ఇటీవల సర్పంచ్ పదవికి ఆమె రాజీనామా చేయడంతో దానిపై క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు విచారణ చేశారు. ఆమె స్వయంగా తన పదవికి రాజీనామా చేసినట్లు నిర్ధారణ కావడంతో ఆమోదించారు. గ్రామపంచాయతీలో పరిపాలనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఉప సర్పంచ్‌కు ఇన్‌చార్జి సర్పంచ్ పదవి అప్పగించారు. గ్రామంలో అభివృద్ధి పనులకు అవసరమైన తీర్మానాలను ఆమోదించడంతోపాటు నిధులను వినియోగించుకునే విఽధంగా అవకాశం కల్పిస్తూ డీపీవో ఉత్తర్వులు జారీ చేశారు.