పేద, మధ్యతరగతి వర్గాలకు జీఎస్టీ తగ్గింపు వరం
ABN , Publish Date - Oct 05 , 2025 | 10:58 PM
తగ్గిన జీఎస్టీ వలన పేద, మధ్య తరగతి, రైతు వర్గాలకు వరమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నా రు. 15వ బ్లాకులో ఆదివారం సూపర్ జీ ఎస్టీ - సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ని ర్వహించారు.
15వ బ్లాకులో ప్రచారం
నిర్వహించిన ఎమ్మెల్యే కందుల
మార్కాపురం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : తగ్గిన జీఎస్టీ వలన పేద, మధ్య తరగతి, రైతు వర్గాలకు వరమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నా రు. 15వ బ్లాకులో ఆదివారం సూపర్ జీ ఎస్టీ - సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ని ర్వహించారు. ఇంటింటికీ తిరిగి జీఎస్టీ పాంప్లెట్‌లను ఎమ్మెల్యే నారాయణరెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వలన కేంద్ర ప్రభుత్వానికి రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయం తగ్గినా ప్రజల ప్రయోజనం కోసం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రజలకు రూ.8 వేల కోట్ల మేర లబ్ధి చేకూరనుందన్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు ప్రయోజనాలు పొందుతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా తాజాగా ఆటో డ్రైవర్‌లకు రూ.15వేల ఆర్థిక సాయయాన్ని అందించినట్లు చెప్పారు. సుమారు 8 వార్డుల ప్రజలకు సంబంధించిన శ్మశాన వాటిక సమస్యను పరిష్కరించామన్నారు. పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఇబ్రహీంఖాన్, టీడీపీ నాయకులు షేక్ మౌళాలి, కొప్పుల శ్రీనివాసులు, కనిగిరి రమణ, సయ్యద్ గఫార్, బాబీ, యలమంద పాల్గొన్నారు.