జీఎస్టీ తగ్గింపు ధరలను అమలు చేయాలి
ABN , Publish Date - Sep 30 , 2025 | 10:44 PM
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన జీఎస్టీ తగ్గింపు ధరలకే నిత్యావసర సరకులు, ఎలక్ర్టానిక్స్, మోటా ర్ వస్తువులను ప్రజలకు అందించాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వ్యాపారులకు సూచించారు. మంగళవారం గిద్దలూరు పట్టణంలోని రిలయన్స్ స్మార్ట్ బజార్‌ను ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
స్మార్ట్ బజార్‌లో ఆకస్మిక తనిఖీ
గిద్దలూరు టౌన్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన జీఎస్టీ తగ్గింపు ధరలకే నిత్యావసర సరకులు, ఎలక్ర్టానిక్స్, మోటా ర్ వస్తువులను ప్రజలకు అందించాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వ్యాపారులకు సూచించారు. మంగళవారం గిద్దలూరు పట్టణంలోని రిలయన్స్ స్మార్ట్ బజార్‌ను ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణల అమలుపై ఆయన ఆరా తీశారు. జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారులు పొందిన ప్రయోజనం వాస్తవ అనుభూతిని అక్కడున్న వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. నిత్యవసర వస్తువులు పా లు, పెరుగు, పప్పుదినుసులు, నూనె, సబ్బులు, పేస్టు కొనుగోలు చేసిన వినియోగదారులను ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి అడగ్గా 10 నుంచి 20 శాతం వరకు ధరలు తగ్గినట్లు వారు తెలిపారు. హీరో హోండా షోరూంలలో మధ్యతరగతి యువకుడు జీఎస్టీకి ముందు రూ.1.15 లక్షల కెనెటిక్ హోండా బైక్ కొనలేక సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేయాలని అనుకున్నానని, అయితే ఇప్పుడు రూ.97వేలకు అందుబాటులోకి వచ్చింద ని ఆ వినియోగదారుడు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చాడు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక సంస్కరణల ద్వారా ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేస్తున్నారని ఆయన తెలిపారు. గత వైసీపీ పాలనలో ట్రు అప్ చార్జీల పేరుతో ప్రజలపై భారం మోపితే ప్రజా ప్రభుత్వం ట్రు డౌన్ ద్వారా విద్యుత్ చార్జీలను తగ్గించిందని అశోక్‌రెడ్డి వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్, వైస్ చైర్మన్ బైలడుగు బాలయ్య, గోడి ఓబులరెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాలీశ్వరయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు సయ్యద్ షానేషావలి, మున్సిపల్ కమిషనర్ ఈవీ రమణబాబు, తహసీ ల్దార్ ఆంజనేయరెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.