Share News

జీఎస్టీ 2.0తో అందరికీ మేలు

ABN , Publish Date - Oct 04 , 2025 | 01:11 AM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపె ట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో అన్నివర్గాల వారికి మేలు జరుగుతుందని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వివరిస్తున్నారు. ఇందు కోసం జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. శుక్రవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు.

జీఎస్టీ 2.0తో అందరికీ మేలు
ఒంగోలులో ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభిస్తున్న ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల, కలెక్టర్‌ రాజాబాబు, మేయర్‌ సుజాత, టీడీపీ దర్శి ఇన్‌చార్జి లక్ష్మి

జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు

వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు

ఒంగోలులో పాల్గొన్న ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే జనార్దన్‌, కలెక్టర్‌ రాజాబాబు

ఇతర ప్రాంతాల్లో వివిధ శాఖల ద్వారా సభలు

వ్యాపార వర్గాలతో దినకర్‌ సమావేశం

నగరంలో పలుచోట్ల తనిఖీలు

ఒంగోలు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపె ట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో అన్నివర్గాల వారికి మేలు జరుగుతుందని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వివరిస్తున్నారు. ఇందు కోసం జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. శుక్రవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. గతంలో ఉన్న వాటి స్థానంలో రెండు శ్లాబుల విధానాన్ని గతనెల 22 నుంచి కేంద్రం అమలులోకి తెచ్చిన విషయం విదితమే. గతంలో 5, 12, 18, 28 శాతం జీఎస్టీ శ్లాబులు ఉండగా ప్రస్తుతం 5, 18 శాతం శ్లాబులు అమలులో వచ్చాయి. ఈ సంస్కర ణల ద్వారా కొన్ని వస్తువులపై పన్ను పూర్తిగా రద్దుచేయగా, మరికొ న్నింటిపై తగ్గించారు. పండుగ సమయంలో అన్ని వర్గాల వారికి ఇది ఊరట కలిగించింది. ఆమేరకు కొనుగోళ్లు కూడా పెరిగాయి.

భారీ ట్రాక్టర్ల ర్యాలీ

జీఎస్టీ తగ్గింపుపై నెలరోజులపాటు ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమలను చేపట్టాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. తదనుగు ణంగా జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆ కార్యక్ర మాలు చేపట్టారు. వ్యవసాయ, అనుబంధ రంగాల యంత్రాలపై పన్ను భారీగా తగ్గిన నేపథ్యంలో ఆ శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యా ప్తంగా శుక్రవారం ర్యాలీలు నిర్వహించారు. ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం హైస్కూల్‌లో సభ నిర్వహించి అనంతరం నగరంలో భారీ ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, కలెక్టర్‌ రాజాబాబు, డీఏవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రకాశం భవన్‌లో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో వ్యాపార, వాణిజ్య వర్గాలు, ఆడిటర్లతో సమావేశం నిర్వహించారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌ పాల్గొని కేంద్రప్రభుత్వ సంస్కరణలు వివరించారు. నగరంలో డీమార్ట్‌ మాల్‌లో జీఎస్టీ అమలు తీరును ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, లంకా దినకర్‌ పరిశీలించి వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. ఇతరచోట్ల కూడా పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా వ్యవసాయశాఖతోపాటు ఇతర ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు, సభలు, సమావేశాలను నిర్వహించారు.

Updated Date - Oct 04 , 2025 | 01:11 AM