Share News

సోలార్‌ హబ్‌కు పచ్చజెండా

ABN , Publish Date - Nov 11 , 2025 | 01:32 AM

నియోజక వర్గంలో సోలార్‌ యూనిట్‌ల పరికరాల తయారీ హబ్‌ కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

సోలార్‌ హబ్‌కు పచ్చజెండా

అద్దంకి, నవంబరు10 (ఆంధ్రజ్యోతి) : నియోజక వర్గంలో సోలార్‌ యూనిట్‌ల పరికరాల తయారీ హబ్‌ కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. నియోజక వర్గంలోని బల్లికురవ మండలం ఎస్‌ఎల్‌ గుడిపాడు, ముక్తేశ్వరం, సంతమాగులూరు మండలం తూర్పు కుందుర్రు రెవెన్యూల పరిధిలో వెయ్యిఎకరాలలో రెన్యూ వబుల్‌ ఎనర్జీ మాన్యుఫాక్చ రింగ్‌జోన్‌ ఏర్పాటు చేసేందుకు ఏపీఎస్‌పీసీఎల్‌ ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున సోలార్‌ ప్లాంట్‌లు, యూనిట్‌ లు ఏర్పాటు జరుగుతున్నాయి. కేం ద్ర ప్రభుత్వం కూడా రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యం లో సోలార్‌ ప్లాంట్ల, యూనిట్లలో వినియోగించే వస్తువులు తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంతో విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ మరింత చొరవ తీసుకొని నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిం చారు. అందుకు అవసరమైన వెయ్యి ఎకరాల భూము లు బల్లికురవ, సంతమాగులూరు మండలాలలో గుర్తించారు. రైతులకు పరిహారంగా ఎకరాకు రూ.18 లక్షల చొప్పున చెల్లించే విధంగా కూడా అధికారులు పలు ధఫాలుగా రైతులతో చర్చించారు. అదే సమయంలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే వీలు ఉండడంతో రైతులు కూడా తమ భూములు ఇచ్చేందుకు సుముఖత చూపారు. ఇప్పటికే బల్లికురవ, సంతమాగులూరు మండలాలలో గ్రానైట్‌ పరిశ్రమతో ప్రత్యేక గుర్తింపు రాగా, రెన్యూవబుల్‌ ఎనర్జీ మాన్యుపాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటుతో మరింత గుర్తింపు రానుంది.

Updated Date - Nov 11 , 2025 | 01:32 AM