ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి
ABN , Publish Date - Nov 17 , 2025 | 10:37 PM
కనిగిరి ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యసేవలకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని వైద్య ఆరోగ్యశాయ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి కోరారు. సోమవారం అమరావతిలో మంత్రి చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి ఆసుపత్రి పరిస్థితిని వివరించారు.
వైద్యఆరోగ్యశాఖ మంత్రిని కోరిన ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): కనిగిరి ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యసేవలకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని వైద్య ఆరోగ్యశాయ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి కోరారు. సోమవారం అమరావతిలో మంత్రి చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి ఆసుపత్రి పరిస్థితిని వివరించారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత, అవసరమైన వైద్యసేవలతో పాటు తగినన్ని పరికరాలు కూడా లేవని మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్ళారు. కనిగిరి ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై నివేదికను మంత్రికి డాక్టర్ ఉగ్ర సమర్పించారు. ఆసుపత్రిలో వైద్యుల సంఖ్యను కూడా తక్షణం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆసుపత్రికి వచ్చే వారికి అందించే అత్యవసర సేవలపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ కోసం మరో కేంద్రాన్ని మంజూరు చేసినందుకు మంత్రికి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర కృతజ్ఞతలు తెలిపారు. దీంతో కనిగిరి ప్రాంత డయాలసిస్ బాధితులకు సత్వర సేవలతో పాటు, ఎక్కువ మంది బాధితులకు వైద్య సేవలు అందించేందుకు వెసులుబాటు ఏర్పడునుందని తెలిపారు. మంత్రిని కలిసినవారిలో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డితో పాటు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, టీడీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎరిక్షన్‌బాబు ఉన్నారు.