వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు
ABN , Publish Date - May 15 , 2025 | 11:11 PM
మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు రెండోరోజు గురువారం గ్రామస్థుల సహకారంతో వైభవం గా నిర్వహించారు.
దొనకొండ, మే 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు రెండోరోజు గురువారం గ్రామస్థుల సహకారంతో వైభవం గా నిర్వహించారు. గ్రామ పురోహితులు రెంటచింతల సత్యనారాయణశర్మ, బద్వేలుకు చెందిన వేదపండితులు ఓరుగంటి సీతారామశర్మ బృందం ఆధ్వర్యంలో గణపతి హోమాలు, వాస్తు హోమం, చండీ హోమం, తదితర హోమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దేవతల విగ్రహాలకు పాల భిషేకం చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవాల యంతో పాటు పరిసరాలను విద్యుత్‌దీపాలతో అలంకరించారు. ఈ వేడుక లతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.