Share News

రైతుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Dec 04 , 2025 | 12:41 AM

వేటపాలెం మండలం పాపాయిపాలెంలో బుధవారం నిర్వహించిన ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య, యువనాయకులు గౌరీఅమర్నాధ్‌తో కలిసి పాల్గొన్నారు.

 రైతుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

పాపాయిపాలెం (చీరాల), డిసెంబరు3 (ఆంధ్ర జ్యోతి) : వేటపాలెం మండలం పాపాయిపాలెంలో బుధవారం నిర్వహించిన ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య, యువనాయకులు గౌరీఅమర్నాధ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతలకు అండగా ప్రజా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు. పంటల బీమా, పెట్టుబడి సాయం, నష్టపరిహారాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరిం చారు. అయితే సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి అధికారుల నుంచి తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సాంబశివరావు, ఏవో సరిత, ఏఎంసీ చైర్మన్‌ జనార్ధనరావు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

పర్చూరు : లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్‌ భావన అన్నారు. మండలంలోని ఉప్పుటూరు గ్రామంలో రైతులు, అధికారులతో కలసి నిర్వహించిన ‘రైతన్న మీ కోసం’ వర్క్‌ షాపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకోసం పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని ఆమె రైతులు, అధికారులతో కలసి వీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకొని నాణ్యమైన దిగుబడులను పొందాలని కోరారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టు బడులతో అధిక దిగుబడులను సాధించ వచ్చన్నారు. ఆదిశగా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలన్నారు. తద్వారా ఆశాజనకమైన దిగుబడులతో పాటు, భూమికూడా సారవంతం అవుతుందన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి వర్క్‌షాపును ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఏడీఏ జీ.ప్రవీణ, శాస్త్రవేత్త మురళీనాయక్‌, పశు సంవర్ధనశాఖ ఎడీ మాధవి, అరుణ, తహసీల్దార్‌ పి.బ్రహ్మయ్య, దేవాదాయశాఖ అధికారి దామా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రైతులు నాణ్యమైన దిగుబడులను పెంచుకోవాలి

మార్టూరు: ప్రకృతి వ్యవసాయంద్వారా రైతులు ఖర్చును తగ్గించుకొని, నాణ్యమైన దిగుబడులను పెంచుకోవాలని మండల ప్రత్యేకాధికారి, డ్వామా పీడీ విజయలక్ష్మి అన్నారు. బుధవారం యద్దనపూడి మండలంలోని పూనూరులోని రైతుసేవాకేంద్రంలో ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమంలో విజయలక్ష్మి పాల్గొ న్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో ఏవో కుమారి, ఇన్‌చార్జ్‌ ఎంపీడీవో కృష్ణ, పశువైద్యాధికారి శారద, పీఏసీఎస్‌ అధ్యక్షులు వీ.వెంకటేశ్వర్లు, నీటి సంఘం అధ్యక్షులు ప్రభాకరరావు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

చినగంజాం : వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. మండలంలోని చినగంజాం రైతుసేవా కేంద్రంలో బుధవారం నిర్వహించిన ‘రైతన్న మీ కోసం’ వర్క్‌ షాప్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏవో ఆర్‌.చంద్రశేఖర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ రైతులకు కూటమి ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుం దన్నారు. ‘రైతు బలమే- రాష్ట్ర బలం’ అన్న నినాదంతో ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. గత ప్రభు త్వ హయాంలో లిఫ్ట్‌ ఇరిగేషన్లన్నీ మూతపడినట్లు తెలిపారు. కాలువలో తూటికాడ, గుర్రపు డెక్కలతో నిండి చివరి ఆయకట్టు భూములకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. అయితే నేడు పరిస్థితి మారిందన్నారు. మెంథా తుఫాన్‌ కారణంగా కొమ్మమూరు కాలువకు వంద చోట్ల గండ్లు పడితే వాటిని ఐదు రోజులలో పూడ్చి రైతులకు నీరు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. నిమోజకవర్గంలోని లిఫ్ట్‌ ఇరిగేషన్‌లకు మరమ్మతులు చేయించి, వాటికి వంద కోట్ల రూపాయిల నిధులను కేటాయించి ఐదు సంవత్సరాలు వరకు మరమ్మతులు చేయించే బాధ్యతను ప్రభుత్వం తీసుకున్నట్లు తెలిపారు. రూ.45 కోట్లతో లింక్‌ రోడ్లు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పెద్దపూడి విజయ్‌కుమార్‌, పర్చూరు ఏఎంసీ చైర్మన్‌ గుంజి వెంకటరావు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి లవన్న, డీఎల్‌డీవో పద్మావతి, తహసీల్దార్‌ జె.ప్రభాకరరావు, ఎంపీడీవో కె.ధనలక్ష్మి, వ్యవసాయా ధికారులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 12:41 AM