Share News

కాపుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:01 PM

కాపుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్డులో బలిజ సేవా సంఘం భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఎమ్మె ల్యే అశోక్‌రెడ్డి ఆవిష్కరించారు.

కాపుల సంక్షేమానికి  ప్రభుత్వం కృషి
శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే

శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 5 (ఆంధ్ర్యోతి): కాపుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్డులో బలిజ సేవా సంఘం భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఎమ్మె ల్యే అశోక్‌రెడ్డి ఆవిష్కరించారు. గత టీడీపీ హయాంలో నియోజకవర్గంలో కాపు భవనాలు మంజూరు చేస్తే వైసీపీ వచ్చాక వాటిని నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఏడుగురు కాపులకు నామినేటెడ్‌ పదవులు కేటాయించామని, కాపుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాపు సంఘం నాయకులు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని పూలమాలలు, శాలువలతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బలిజ సేవా సంఘం అధ్యక్షుడు యగటీల రంగసుబ్బయ్య, శాంతిరామ్‌ ఆసుపత్రి అధినేత శాంతిరామ్‌, న్యాయవాది రామచందర్‌రావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కుప్పా రంగసాయి, సొసైటీ బ్యాంక్‌ చైర్మన్‌ దుత్తా బాలీశ్వరయ్య, కాపు సంఘం నాయకులు పసుపులేటి శ్రీనివాసులు, అబ్బు ఓబయ్య, ఉలాపు బాలచెన్నయ్య, గజ్జలకొండ నారాయణ, కమతం శ్రీను, నారిశెట్టి వీరమ్మ, బెల్లంకొండ విజయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2025 | 11:01 PM