తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండ
ABN , Publish Date - Nov 01 , 2025 | 10:20 PM
తుఫాన్ కారణంగా పనులకు వెళ్లలేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలిచిందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పేర్కొన్నారు. పంచాయతీ కార్యాల యం ఆవరణలో పునరావాస బాధితులకు బియ్యం, ఆర్థిక సాయాన్ని ఎరిక్షన్‌బాబు శనివారం అందజేశారు.
టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు
పెద్ద దోర్నాల, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : తుఫాన్ కారణంగా పనులకు వెళ్లలేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలిచిందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పేర్కొన్నారు. పంచాయతీ కార్యాల యం ఆవరణలో పునరావాస బాధితులకు బియ్యం, ఆర్థిక సాయాన్ని ఎరిక్షన్‌బాబు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూరదృష్టి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో ముందు జాగ్రత్త చర్యలతో తుఫాన్ నుంచి ప్రాణనష్టం లేకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా గట్టెక్కామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు అశోక్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీవో నాసర్‌రెడ్డి, ఈవో శివకోటేశ్వరరావు, ఎంఈవో మస్తాన్ నాయక్, ఏవో జవహర్‌లాల్ నాయక్, సర్పంచ్ చిత్తూరిహారిక, టీడీపీ మండల అధ్యక్షుడు షేక్ మాబు, నాయకులు దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, చంటి, పబ్బతి సుబ్బారావు, కటికల శ్రీనివాసులు, దర్శనం దేవయ్య, ఒంటేరు రాఘవ, ఐటీడీపీ బాబు పాల్గొన్నారు.