రైతుల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు
ABN , Publish Date - Nov 25 , 2025 | 10:10 PM
రైతాంగాభివృద్ధికి ప్రభుత్వం మరింత తోడ్పాటు అందిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రైతాంగాభివృద్ధికి ప్రభుత్వం మరింత తోడ్పాటు అందిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయాధికారుల సూచనల మేరకు నేలాఽధారిత పంటలు సాగు చేసుకోవాలన్నారు. అధిక లాభాలు వచ్చే పంటలను సాగుచేసి రైతులు ఆర్థికంగా పురోగతి చెందాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై మరింత అవగాహన పెంచుకుని ఆ దిశగా పంటలను సాగుచేస్తే మేలు చేకూరుతుందన్నారు. వ్యవసాయాధికారులు సూచించిన విషయాలను జాగ్రత్తగా పాటించి వాతావరణ మార్పులకు అనుగుణంగా విత్తన వినియోగం చేపట్టాలన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతు రాజుగా మార్చాలన్నదే సంకల్పంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పంటల సాగుపై రైతులకు వ్యవసాయాధికారులు వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ జైనులాబ్దిన్, నాయకులు యారవ శ్రీను, గంజికుంట శ్రీనివాసులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కాగా, పట్టణ సమీపంలోని కస్తూర్భాగాంధీ స్కూల్‌లో విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర స్థల పరిశీలన కోసం పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఖాళీ ప్రదేశాన్ని సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్దులనుద్దేశించి అధునాతన పరిఙ్ఞానాన్ని పెంపొందించేందుకు కంప్యూటర్ పరిఙ్ఞానం అవసరమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, విద్యార్థులు పాల్గొన్నారు.