Share News

క్రీడలకు ప్రభుత్వం చేయూత

ABN , Publish Date - Dec 30 , 2025 | 01:27 AM

క్రీడలకు ప్రజాప్రభుత్వం చేయూతనిస్తున్నదని, క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఏపీ మారిటైంబోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య అన్నారు. సోమవారం కొండపిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి టెన్ని్‌సబాల్‌ క్రికెట్‌ పోటీలను సత్య ప్రారంభించారు. క్రికెట్‌ ఆడి సత్య అభిమానులను అలరించారు.

క్రీడలకు ప్రభుత్వం చేయూత
క్రీడాపోటీలను ప్రారంభిస్తున్న మారిటైం బోర్డు చైర్మన్‌ సత్య

కొండపిలో ఏడాదిలోగా ఆడిటీరియం నిర్మిస్తామని హామీ

కొండపి, డిసెంబరు29 (ఆంధ్రజ్యోతి): క్రీడలకు ప్రజాప్రభుత్వం చేయూతనిస్తున్నదని, క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఏపీ మారిటైంబోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య అన్నారు. సోమవారం కొండపిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి టెన్ని్‌సబాల్‌ క్రికెట్‌ పోటీలను సత్య ప్రారంభించారు. క్రికెట్‌ ఆడి సత్య అభిమానులను అలరించారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో సత్య మాట్లాడుతూ కొండపిలో దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో క్రీడా మైదానాన్ని నిర్మిస్తామన్నారు. స్థలం లేక నిర్మాణం జరగలేదన్నారు. ఏడాదిలోగా స్థలాన్ని ఎంపిక చేసి, క్రీడా మైదానం నిర్మించి, భవిష్యత్‌లో జిల్లా, రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు వేదికగా కొండపిని తీర్చుదిద్దుతామన్నారు. 11 సంవత్సరాలుగా క్రికెట్‌ పొటీలను నిర్వహిస్తున్న నేతి రవికుమార్‌ (ఎన్‌ఆర్‌కె) యూత్‌ను సత్య అభినందించారు. టీడీపీ ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షుడు గొర్రెపాటి రామయ్య చౌదరి మాట్లాడారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌కెయూత్‌ అధ్యక్షుడు నేతి రవికుమార్‌, టీడీపీ కొండపి మండల అధ్యక్షుడు కొర్రపాటి వసంతరాయుడు, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర నాయకుడు బత్తుల నారాయణస్వామి, చాగంరెడ్డి నరసారెడ్డి, మర్రిపూడి మండల అధ్యక్షుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఒంగోలు పార్లమెంటు అధికార ప్రతినిధి దాసరి వెంకటేశ్వర్లు, ఒంగోలు పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి చేరెడ్డి నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డొక్కా సీతమ్మ భోజనం పరిశీలన

కొండపి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య సోమవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. భోజనం మెనూను అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యత పరిశీలించారు. నాణ్యత, శుచి, శుభ్రత బాగుంటున్నదని విద్యార్థులు తెలియజేయడంతో కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.వెంకటేశ్వర్లును అభినందించారు. భోజనం నాణ్యతను ఇలాగే కొనసాగించాలని సత్య ప్రిన్సిపాల్‌కు సూచించారు.

Updated Date - Dec 30 , 2025 | 01:27 AM