Share News

పేదలకు అండగా ప్రభుత్వం

ABN , Publish Date - Nov 20 , 2025 | 10:27 PM

పేదలకు అం డగా ప్రజాప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. కనిగిరి మండలం పునుగో డు గ్రామానికి చెందిన తోకల చిననరసయ్య గత మా ర్చిలో ప్రమాదవశాత్తు కరెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడటం తో షాక్‌కు గురై మృతి చెందారు.

పేదలకు అండగా ప్రభుత్వం
బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందజేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు అందజేత

కనిగిరి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): పేదలకు అం డగా ప్రజాప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. కనిగిరి మండలం పునుగో డు గ్రామానికి చెందిన తోకల చిననరసయ్య గత మా ర్చిలో ప్రమాదవశాత్తు కరెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడటం తో షాక్‌కు గురై మృతి చెందారు. మృతుని కుటుం బానికి గురువారం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.

ఈసందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ విద్యుత్‌ ప్రమాదంలో మరణించటం దురదృష్టకరమన్నారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడి ఇచ్చిన హామీ మేరకు రూ.5 లక్షలు మంజూర చేసిందని చెప్పారు. గతంలో కూడా కనిగిరి ప్రాంతంలో విద్యార్థులు విద్యుత్‌ షాక్‌కు గురైన సందర్భాల్లో వారి కుటుంబాలకు ప్రభుత్వం తరుపున ఎక్స్‌గ్రేషియా అందజేసినట్టు చెప్పారు.

కార్యక్రమంలో విద్యుత్‌ ఈఈ ఆర్‌.ఉమాకాంత్‌, టీడీపీ నాయకులు పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, కొండా కృష్ణారెడ్డి, పట్టాణాధ్యక్షుడు షేక్‌ ఫిరోజ్‌, విద్యుత్‌ ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 10:27 PM