Share News

వర్షబాధితులకు అండగా ప్రభుత్వం

ABN , Publish Date - Oct 30 , 2025 | 02:06 AM

తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలతో తీవ్రంగా నష్ట పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభు త్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తక్షణ సాయంగా బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంది.

వర్షబాధితులకు అండగా ప్రభుత్వం

బియ్యం, ఇతర నిత్యావసర సరుకులపంపిణీ చేసేందుకు వివరాల సేకరణ

ఒంగోలు కలెక్టరేట్‌, అక్టోబరు 29 (ఆంఽఽధ్రజ్యోతి): తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలతో తీవ్రంగా నష్ట పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభు త్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తక్షణ సాయంగా బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంది. అందుకు సంబంధించి జీవో నెంబరు 115ను విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం కిలో కందిపప్పు, కిలో అయిల్‌, ఉల్లిపాయలు కిలో, బంగాళాదుంపలు కిలో, చెక్కర కిలో అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. మత్స్యకారులకు మాత్రం అదనంగా మరో 25 కిలోల బియ్యం ఇవ్వాలని సూచించింది. తదనుగుణంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో 39 మండలాలు ఉండగా తహసీల్దార్లను బాధిత కుటుంబాల వివరాలు ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ అధికారులు కోరినట్లు సమాచారం. వారు ఇచ్చే జాబితాలకు అనుగుణంగా ఆయా రేషన్‌ షాపుల ద్వారా బాధితులకు సరుకులను పంపిణీ చేయనున్నట్లు సమాచారం. జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ అధికారులు అందుకు సంబంధించి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు.

Updated Date - Oct 30 , 2025 | 02:06 AM