రైతన్నలకు అండగా ప్రభుత్వం
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:35 PM
రైతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చెప్పారు.
ఎమ్మెల్యే కందుల
మార్కాపురం రూరల్, డిసెంబరు19 (ఆంధ్రజ్యోతి): రైతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చెప్పారు. మండలంలోని వేమలకోట గ్రామంలో శుక్రవారం సాయత్రం పల్లె పండుగ, రైతన్న మీకోసం కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రైతన్నలను అన్ని విధాలా అండగా ఉండి ఆదుకుంటోందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అపార అనుభవంతో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ప్రకటించిన చంద్రబాబును ఈ ప్రాంత ప్రజలు ఆరాధ్యదైవంగా కొలుస్తున్నట్లు చెప్పారు. చాలా గ్రామాల్లో మహిళలు స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలచెన్నయ్య, ఏవో బుజ్జిబాయి, మార్కెట్ యార్డు చైర్మన్ వెంకటరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు జవ్వాజి రామాంజులరెడ్డి, గొలమారి నాసర్‌రెడ్డి పాల్గొన్నారు.
రైతుల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ ధ్యేయం
తర్లుపాడు, డిసెంబరు 19 (ఆంధ్రజోతి) : రైతుల జీవితాల్లో వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చెప్పారు. మండలంలోని కలుజువ్వలపాడులో రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ విధానాల్లో పలు మార్పులు తీసుకొచ్చి వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సందర్భంగా మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ బాలాజీ నాయక్, వ్యవసాయ అధికారిని జ్యోత్స్నాదేవి, మండల పార్టీ అధ్యక్షుడు ఉడుముల చిన్నపరెడ్డి, మార్కాపురం ఏఎంసీ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, కంచర్ల కాశయ్య, మాజీ ఎంపీపీ పులియం ఏసుదాసు, కూనపులి మహేష్, మేకల అచ్చిరెడ్డి, నంబుల లక్ష్మయ్య పాల్గొన్నారు.