ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విహారయాత్ర
ABN , Publish Date - Dec 14 , 2025 | 10:41 PM
విద్య అనేది పుస్తకాలకే పరిమితం కాకుండా అనుభవాలతో కూడిన దే అనే భావనకు నిదర్శనంగా నిలుస్తూ ఎమ్మెల్యే డా క్టర్ ఉగ్రనరసింహారెడ్డి సేవాభావాన్ని చాటుకుంటున్నా రు.
ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో బస్సుల ఏర్పాటు
పీసీపల్లి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): విద్య అనేది పుస్తకాలకే పరిమితం కాకుండా అనుభవాలతో కూడిన దే అనే భావనకు నిదర్శనంగా నిలుస్తూ ఎమ్మెల్యే డా క్టర్ ఉగ్రనరసింహారెడ్డి సేవాభావాన్ని చాటుకుంటున్నా రు. ఈనెల 5న పీసీపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్‌లో ఇచ్చిన హామీ మేరకు ఆదివారం 280 మంది విద్యార్థులను ఐదు ప్ర త్యేక బస్సుల్లో పవిత్ర పుణ్యక్షేత్రాలైన భైరవకోన, మిట్ట పాలెం నారాయణస్వామి దేవస్థానాల సందర్శన కోసం విహారయాత్రకు పంపించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలను ఆస్వాదించా లన్న ఉద్దేశంతో చేపట్టిన ఈకార్యక్రమం విద్యార్థుల్లో ఆనందాన్ని నింపింది. తల్లిదండ్రుల సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే ఉగ్ర తన సొంత నిధులతో విద్యార్థులను విహారయాత్రకు పంపించడం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విహారయాత్రలో భైరవకోనలోని శివలిం గాల ప్రతిష్టత, త్రిముఖ భ్రమరాంబికాదేవి, మిట్టపాలెం నారాయణస్వామి విశిష్టతను విద్యార్థులకు ఉపాధ్యా యులు వివరించారు. విహారయాత్రకు వెళ్లే బస్సులను టీడీపీ మండల అధ్యక్షుడు వేమూరి రామయ్య జెండా ఊపి ప్రారభించారు. కార్యక్రమంలో ఎంఈవో ఆర్.శ్రీ నివాసులు, ప్రధానోపాధ్యాయుడు సుబ్బరామయ్య, నా యకులు నాగేశ్వరరావు, నాగేంద్రబాబు, వెంగయ్య, వెం కటేశ్వరరెడ్డి, ఏడుకొండలు, ప్రభు, చిన్నా, తిరుపతయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.