Share News

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN , Publish Date - Sep 13 , 2025 | 10:20 PM

ప్ర భుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. శనివారం వెలి గండ్లలోని టీడీపీ కార్యాలయంలో కుటుంబ సాధి కార సారథులు, మండల నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

వెలిగండ్ల, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్ర భుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. శనివారం వెలి గండ్లలోని టీడీపీ కార్యాలయంలో కుటుంబ సాధి కార సారథులు, మండల నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీకి కు టుంబ సాధికార సారథులే కీలకమన్నారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుం దన్నారు. గత ఐదేళ్లలో పార్టీ అధికారంలో లేనప్పటికీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారన్నారు. అలాంటి వాళ్ళకి పార్టీ తగిన గుర్తింపు ఇచ్చి అండగా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా సాధికార సభ్యులు గ్రామాల్లో త మకు కేటాయించిన కుటుంబాలను సందర్శించి సమ స్యలను తెలుసుకోవాలన్నారు. గ్రామాల్లో నీటి సమస్య ఉంటే సొంత నిధులతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని డాక్టర్‌ ఉగ్ర చెప్పారు. మండలంలోని పద్మాపురం, బల్లవరం, గన్నవరం, గడ్లోపల్లి, చెన్నంపల్లి గ్రామాలకు త్వరలో రోడ్లు మంజూరు చేయిస్తామ న్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన టీడీపీ మం డల అధ్యక్షుడు కేలం ఇంద్రభూపాల్‌రెడ్డిని ఎమ్మెల్యే, నాయకులు ఘనంగా సన్మానించారు.

గన్నవరం బ్రిడ్జి పరిశీలన

గత 12 సంవత్సరాలుగా పెం డింగ్‌లో ఉన్న గన్నవరం బ్రిడ్జిని పూర్తిచేయిస్తానని ఎన్నికల్లో ఎమ్మె ల్యే డాక్టర్‌ ఉగ్ర హామీ ఇచ్చారు. ఆ మేరకు రూ.రెండు కోట్ల 20 లక్షలు నిధులు మంజూరు చేయించి ని ర్మాణం పూర్తి చేయించారు. శనివా రం గన్నవరం బ్రిడ్జిని పరిశీలించిని ఆయన త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్ర మంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్యామల కాశిరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు కేలం ఇంద్రభూపాల్‌ రెడ్డి, దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, ముత్తిరెడ్డి, గవదకట్ల హరి, ఏఎంసీ చైర్మన్‌ యారవ రమాశ్రీనివాస్‌, కొండు భాస్కర్‌ రెడ్డి, ఒంగోలు శ్రీను, భాస్కర్‌రెడ్డి, జైపాల్‌ రెడ్డి, వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, కాశయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 10:20 PM