రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:45 PM
రాజకీయాల కతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తు న్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక మండలపరిషత్ కార్యాలయ సమావేశం హాలులో జరిగిన మండల సర్వసభ్య సమా వేశానికి ఎంపీపీ దంతులూరి ప్రకాశం అధ్యక్షత వహిం చారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): రాజకీయాల కతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తు న్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక మండలపరిషత్ కార్యాలయ సమావేశం హాలులో జరిగిన మండల సర్వసభ్య సమా వేశానికి ఎంపీపీ దంతులూరి ప్రకాశం అధ్యక్షత వహిం చారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాసంక్షేమ పాలనలో అధికారులు భాగస్వామ్యం కావాలని అన్నారు. ప్రభుత్వాధికారులు వారివారి శాఖ ల పరిధిలోని అభివృద్ధి పనుల్లో చురుకుగా వ్యవహ రించాలన్నారు. జలజీవన్ మిషన్ పథకం ద్వారా గ్రా మాల్లో నీటి సరఫరా పైపులైను పనులు జరుగుతున్నా యన్నారు. ప్రజలు వారికి సహకరించాలన్నారు. ప్రభు త్వ పథకాలు మంజూరు విషయంలో పక్షపాతం లే కుండా అర్హులందరికీ అందజేస్తున్నట్టు చెప్పారు. గ్రా మాల్లో మురుగు సమస్య తీరాలంటే మ్యాజిక్ డ్రైయి న్స్ నిర్మించుకోవాలన్నారు. గృహాలు నిర్మించుకునే వా రికి పొజిషన్ సర్టిఫికెట్ మంజూరులో ఇబ్బందులు పెట్టవద్దని రెవిన్యూ అధికా రులను ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయటంతో బస్సులు రద్దీగా ఉంటున్నాయ న్నారు. అవసరమైనచోట అదనంగా బస్సులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆర్టీసీ అధికారులకు సూచించారు. వ్యవసాయశాఖ ద్వారా జరుగుతున్న పనుల్లో భాగంగా ప్రతి రైతు తమ పంట భూమిని ఈక్రాప్ చేయిం చుకోవాలన్నారు. వైద్యశాఖ ద్వారా అందుతున్న వివిధ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు వారి శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ది పనులను వివరించారు. అనంతరం ఎంపీటీసీలకు ఎమ్మెల్యే చేతు లమీదుగా చీరెలు, దుస్తులు పంపిణీ చేశారు. సమా వేశంలో జడ్పీటీసీ కస్తూరిరెడ్డి, తహసీల్దార్ జయలక్ష్మి, ఎంపీడీవో అబ్దుల్‌ఖాదర్, వివిధ శాఖల మండల అధి కారులు పాల్గొన్నారు.