అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పింఛన్లు
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:15 AM
అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పింఛన్లను అందజేయనున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు.
మార్టూరు, సెప్టెంబరు 1: అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పింఛన్లను అందజేయనున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. మండలంలోని కోనంకి గ్రామంలో ఎన్‌టీఆర్ పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని వృద్ధులను పలకరిస్తూ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎస్సీకాలనీలో నూతనంగా నిర్మించిన సీసీరోడ్లును పరిశీలించారు. కొత్తగా నిర్మాణం చేసిన షెడ్డును పరిశీలించారు. గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలన్నారు. అనంతరం ఈ ఏడాది రైతులు ఏఏ పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారని రైతులను అడిగి తెలుసు కున్నారు. సాగర్ జలాలు విడుదల కావడంతో ఆనందం గా ఉందని పలువురు రైతులు ఎమ్మెల్యే ఏలూరికి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాంబాబు, తహసీల్దార్ టి.ప్రశాంతి, స్థానిక నాయకులు కోటపాటి సురేష్, ఏసుపాదం, వీరవల్లి శ్రీరాములు, సుబ్బారావు, కొర్రపాటి కాజారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పండుగలా పింఛన్ల పంపిణీ
చీరాల : పేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని, ఎమ్మెల్యే కొండయ్య చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న పింఛన్ పంపిణీ కార్యక్రమం సోమవారం నియోజకవర్గంలో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఎమ్మెల్యే కొండయ్య రామాపురం, విజయలక్ష్మీపురం, మున్సిపల్ పరిధిలోని 2వ వార్డుల్లో పాల్గొని పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హుల జాబితాపై ఆందోళన చెందవద్దని సూచించారు. ఆయా ప్రాంతాల్లో సమస్య లను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి అందిన అర్జీలను స్వీకరించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ సాంబశివరావు, కమిషనర్ అబ్దుల్ రషీద్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జర్నలిస్టుకు అండగా ప్రభుత్వం
అర్హత కలిగిన ప్రతీ జర్న లిస్టుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కొండయ్య చెప్పారు. ఇటీవల మరణించిన ప్రముఖ పాత్రికేయులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏపీయుడబ్ల్యుజె మాజీ అధ్యక్షులు కడియం మురళీ సంస్మరణ సభకు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. మురళీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అభ్యున్నతికి కృషి చేస్తుందని వివరించారు.
బల్లికురవ : ప్రభుత్వం అర్హులైన వారికి పించన్లను అందజేస్తోందని, ఎంపీడీవో కుసుమకుమారి పేర్కో న్నారు. మండలంలోని కొప్పెరపాడు గ్రామంలో పించన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ప్రతి ఇంటికి వెళ్లి పించన్లును అందజేయాలని సిబ్బందికి సూచించారు. మెదటిరోజు మండలంలో 92 శాతం పించన్లు పంపిణీ చేశామన్నారు అనంతరం గ్రామంలో పారిశుధ్య పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రోడ్లు వెంబడి చెత్త లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అద్దంకిటౌన్ : అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ, ప్రభుత్వం నెల మొదటి తేదీలలోనే పెన్షన్లను పంపిణీ చేస్తోందని ఎంపీడీవో బత్తిన సింగయ్య తెలిపారు. సోమవారం మండలంలోని జార్లపాలెంతో పాటు పలు గ్రామాలల్లో పర్యటించి పెన్షన్ల పంపిణీ పక్రియను పరిశీ లించారు. పలువురు లబ్ధిదారులు ఎంపీడీవో చేతుల మీదుగా పెన్షన్లు పంపిణి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు నెలలలో పెన్షన్‌లు పొందిన దివ్యాంగు లందరికీ, సెప్టెంబరు నెలలలో కూడా పెన్షన్‌లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నోటీసులు అందుకున్నవారికి పెన్షన్ పంపిణి జరుగుతోందన్నారు. మండలంలో మొత్తం 93 శాతం పంపిణీ పూర్తిచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు.