Share News

మహిళల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - Sep 18 , 2025 | 10:26 PM

మహిళల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుం టుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. గురువారం మండలం లోని చందలూరులో జరిగిన స్వస్త్‌నారీ సశక్త్‌ ప రివార్‌ అభియాన్‌ కార్యక్రమంలో ఆమె మాట్లా డారు.

మహిళల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
మాట్లాడుతున్న డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌

డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): మహిళల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుం టుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. గురువారం మండలం లోని చందలూరులో జరిగిన స్వస్త్‌నారీ సశక్త్‌ ప రివార్‌ అభియాన్‌ కార్యక్రమంలో ఆమె మాట్లా డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన జాతీయ పథకా న్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈప థకానికి సీఎం చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇ స్తూ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటుచేయించినట్టు చెప్పా రు. ఈసందర్భంగా చందలూరులో మహిళలకు నిర్వ హించిన వైద్యశిబిరంలో గుండె జబ్బులు, మధుమే హం, కాన్సర్‌, తదితర వ్యాధులకు వైద్య పరీక్షలు చేశా రు. పోషకాహారం తీసుకోవాల్సిన అవశ్యకతపై గర్భిణు లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్యాధి కారులు డాక్టర్‌ వై.సురేఖ, డాక్టర్‌ వాణి, డాక్టర్‌ లక్ష్మీ పూజిత, డాక్టర్‌ కెవీ శ్రీనివాసులు, డాక్టర్‌ బ్లెస్సీ, మున్సి పల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు, జనసేన నాయకుడు పి.పాపారావు తదితరులు పాల్గొన్నారు.

ముండ్లమూరు: కుటుంబంలోని మహి ళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం, సమాజం మరింత బలంగా ఉంటుందని టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు మట్టా సుబ్బారెడ్డి అన్నారు. గురువారం ముండ్ల మూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్త్‌నారీ సశక్త్‌ పరివార్‌ కార్యక్రమం ని ర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈకార్యక్రమాన్ని ప్రతి మ హిళ వినియోగించుకోవాలన్నారు. కార్య క్రమంలో తహసీల్దార్‌ ఎల్‌.లక్ష్మీనారాయ ణ, జడ్పీటీసీ ఎల్‌.రత్నరాజు, సుంకర రాఘవరెడ్డి, పాలపర్తి సుబ్బారావు, సర్పంచ్‌ గోపనబోయిన వెంకటే శ్వరరావు, డాక్టర్‌ పాశం వెంకటేశ్వరరావు, వైద్యాధికా రులు ఎం.జాస్మిన్‌, జె.వెంకటేశ్వరరెడ్డి, సీహెచ్‌ ప్రవీణ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

తాళ్లూరు: మహిళలు ఆరోగ్య వంతులుగా ఉంటే ఆ కుటుంబం, సమాజం సురక్షితంగా ఉంటుందని ఎం పీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. గురువారం తాళ్లూరు, తూర్పుగంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్వస్త్‌నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ వైద్యశిబిరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాల ని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మారం, డాక్టర్‌ ప్రవీణ్‌, సర్పంచ్‌ చార్లెస్‌ సర్జన్‌, వైస్‌ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, వల్లభనేని సుబ్బయ్య, ఎంపీడీవో సానికొమ్ము సత్యం, తదితరులు పాల్గొన్నారు.

కురిచేడు: స్వస్త్‌నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం కురిచేడు ప్రాథ మిక ఆరోగ్య కేంద్రంలో 326 మంది మహిళలకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈసందర్భంగా వైద్యాధికారి రవితేజ మాట్లాడుతూ మహిళలకు 14 రకాల సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమం లో వైద్యాధికారిణి సుశ్మితారెడ్డి, సర్పంచ్‌ క్రిష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 10:27 PM