సోలార్ ప్రాజెక్టుకు ప్రభుత్వ భూముల పరిశీలన
ABN , Publish Date - May 25 , 2025 | 01:19 AM
మండలంలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు నిమిత్తం ఎంపిక చేసిన ప్రభుత్వ భూములను శనివారం కనిగిరి ఇన్‌చార్జి ఆర్డీవో శివరామిరెడ్డి పరిశీలించారు. ఇన్‌చార్జి తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ మండలంలోని రుద్రస ముద్రం, బాధాపురం, రాగమక్కపల్లి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూము లను చూపించారు.
ఆర్డీవోకు మ్యాప్ ద్వారా వివరించిన తహసీల్దార్
దొనకొండ, మే 24 (ఆంధ్రజ్యోతి) : మండలంలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు నిమిత్తం ఎంపిక చేసిన ప్రభుత్వ భూములను శనివారం కనిగిరి ఇన్‌చార్జి ఆర్డీవో శివరామిరెడ్డి పరిశీలించారు. ఇన్‌చార్జి తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ మండలంలోని రుద్రస ముద్రం, బాధాపురం, రాగమక్కపల్లి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూము లను చూపించారు. వాటికి హద్దులు, ఇతరత్రా వివరాలను మ్యాపుల ద్వారా ఆర్డీవోకు వివరించారు. అనంతరం వారు రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో వీఆర్వో మాచర్ల, సర్వేయర్ మస్తాన్, లైసెన్స్ సర్వేయర్ చెన్నంశెట్టి వెంకటరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.